Poorna: టాలీవుడ్ లో నటి గా పరిచయమైంది పూర్ణ. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లోనూ జడ్జిగా సందడి చేసింది.. ఇటీవల పూర్ణ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్ణ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. పెళ్లి కావడంతో పూర్ణ తనకు ఉన్న సినిమాలు మిగతా షూటింగులు అన్నీ ముగించుకుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఈ మధ్యనే బుల్లితెరకు తను కాస్త దూరంగా ఉన్నట్లు టాక్.. పూర్ణ వీటన్నింటికి దూరంగా ఉండి ఈ గుడ్ న్యూస్ చెప్పడమే కారణం అనిపిస్తుంది.. తాజాగా పూర్ణ తల్లిగా ప్రమోషన్ పొందబోతుంది.. ఆ విషయాన్ని తనే స్వయంగా తెలిపింది..
ఈ ఏడాది జూన్ 12న పూర్ణ దుబాయి బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.. పెళ్లి అయ్యి ఆరు నెలలు తిరగ ఒక ముందే తను గుడ్ న్యూస్ చెప్పింది.. పూర్ణ తల్లి కాబోతున్నట్లు తీపి కబురు తన కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా తెలిపింది.. అందుకు సంబంధించిన తన కుటుంబసభ్యులతో చేసుకున్న సెలబ్రేషన్ ని యూట్యూబ్ లో వీడియో తీసి పోస్ట్ చేసింది. దీన్నే తన ఇన్ స్టా స్టోరీలోనూ షేర్ చేసింది.. మొత్తానికి పూర్ణ మొగుడు మామూలోడు కాదు.. ఇంతా త్వరగా పూర్ణ ని తల్లి చేసావ్.. మరి ఇంత స్పీడా అంటూ ఫ్యాన్స్ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు..
పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఇచ్చాడట. పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడట. దీని విలువ దాదాపుగా రూ. 1.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇంకా దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని.. అది 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్. అంతేకాకుండా ఓ మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా కానుకలుగా ఇచ్చాడట. వీటి విలువ 30 కోట్ల వరకు ఉంటుందట. పూర్ణ ని పెళ్లి చేసుకోక ముందే తన భర్త ఎంత ఆస్తిని ఇస్తే ఇప్పుడు తనకి తండ్రిగా ప్రమోషన్ ఇచ్చినందుకు ఇంకెంత ఆస్తిని ఇస్తాడో.. తనకు ఇంకెంత విలువైన బహుమతులు, కానుకలు ఇస్తాడో చూడాలి.