సినిమా

RC 15: మే 19వ తేదీ నాడు మెగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ రెడీ చేసిన శంకర్..??

Share

RC 15: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుండి వరుసపెట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో “RRR” తో మూడోసారి ఇండస్ట్రీ హిట్ ఫస్ట్ టైం వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నాడు. రామరాజు గా సినిమాలో చరణ్ పెర్ఫార్మెన్స్ “RRR” మొత్తానికి హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

SHANKAR CHARAN TITLE TO BE UNVEILED ON MAY 19

అన్ని రకాలుగా చరణ్ కెరియర్ మూడు.. పూలు ఆరు కాయలు అన్న తరహాలో నడుస్తున్న సమయంలో ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తూ ఉన్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా లో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మూడు డిఫరెంట్ క్యారెక్టర్ లలో రామ్ చరణ్ నీ శంకర్ చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

 

పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ మే 19వ తారీకు రిలీజ్ చెయ్యాలని శంకర్ డిసైడ్ అయినట్లు మెగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనున్న ట్లు ఇండస్ట్రీలో వార్తలు వెలువడుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తో కూడిన టైటిల్ ప్రకటించడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.


Share

Related posts

Hansika Motwani Beautiful Looks

Gallery Desk

బిగ్ బాస్ 4 : ఈ సీజన్ విజేత ఎవరో తెలిసిపోయింది…? జాతకం చెప్పింది అంతటి పవర్ఫుల్ క్యాండిడేట్

arun kanna

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

kavya N