“RC 15” లో చరణ్ తో కొత్త ప్రయోగం చేయబోతున్న శంకర్..??

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దక్షిణాదిలోనే కాదు ఇప్పుడు “RRR” తో దేశవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్ ఉన్న హీరో. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఏ హీరోకి లేని రీతిలో మూడు ఇండస్ట్రీ హిట్స్ చరణ్ కి ఉన్నాయి. కదా ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో “RC 15” అనే వర్కింగ్ టైటిల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ తో కొత్త ప్రయోగం చేయడానికి శంకర్ డిసైడ్ అయ్యారట. మాటల్లోకి వెళ్తే సినిమాలో చరణ్ 3 విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ మూడింటిలో ఒకటి ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో… రామ్ చరణ్ నీ శంకర్ చూపించనున్నారట. సినిమాకి ఈ పాత్ర చాలా హైలెట్ గా ఉండే రీతిలో శంకర్ ప్లాన్ చేశారాట. ఇప్పటివరకు చరణ్ నెగటివ్ క్యారెక్టర్ చేసిన దాఖలాలు లేవు. కెరియర్ పరంగా మంచి టైంలో ఇటువంటి ప్రయోగానికి చరణ్ రెడీ అవ్వటం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గతంలో శంకర్ “అపరిచితుడు” సినిమాలో.. హీరో విక్రమ్ నీ ఒక పాత్రలో నెగిటివ్ గా చూపించడం తెలిసిందే. విక్రమ్ చేసిన నెగిటివ్ పాత్ర ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

ఇప్పుడు అదే దిశగా రామ్ చరణ్ ని చూపించనున్నారట. దిల్ రాజ్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్ కెరియర్ లోనే హై బడ్జెట్ సినిమా. పాన్ ఇండియన్ నేపథ్యంలో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. చరణ్ సరసన హీరోయిన్ పాత్రలో కియరా అద్వానీ నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కమెడియన్ సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వచ్చే నెల చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో “RC 15” నుండి బిగ్ సర్ప్రైజ్ సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

16 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago