ఇండియన్ సినిమా రేంజ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నేటి తరం దర్శకుల్లో తమిళ దర్శకుడు శంకర్.. తెలుగు దర్శకుడు రాజమౌళి ముందు వరుసలో ఉన్నారు. రాజమౌళి డిఫరెంట్ జోనర్ మూవీస్ చేస్తూ తన సినిమాలపై అంచనాలు పెంచుకుంటూ వెళుతుంటే.. కెరీర్ ప్రారంభంలో తన సినిమాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన శంకర్ అందుకు భిన్నంగా తయారైయ్యాడు. ఎందుకనే వివరాల్లోకెళ్తే.. శంకర్ ఎంచుకుంటున్న కథలైనా కావచ్చు.. మరేదైనా కావచ్చు. శంకర్‌కు ఈ మధ్య చెప్పుకోదగ్గ రేంజ్ హిట్ లేదు. శంకర్, విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఐ సినిమా ప్లాప్ కావడంతో .. రజనీకాంత్‌తో 2010లో హిట్ కొట్టిన రోబోకు సీక్వెల్‌గా 2.0ను తెరకెక్కించాడు. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టించాడు. సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఇప్పుడు కూడా తన దర్శకత్వంలో కమల్‌తో చేసిన భారతీయుడు సీక్వెల్ ఇండియన్ 2ను తెరెక్కిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలు శంకర్‌కు కండీషన్స్ పెట్టారని వార్తలు వినపడుతున్నాయి. ఓ రకంగా ఈ సినిమాపై సందిగ్దం నెలకొందని కూడా సమాచారం. అయితే ఇప్పుడు శంకర్ ఇప్పుడు తన బాయ్స్ సినిమాకు సీక్వెల్‌గా బాయ్స్ 2ను తెరకెక్కిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. అయితే బాయ్స్ సినిమానే పెద్దగా సక్సెస్ కాలేదు. అలాంటిప్పుడు అసలు బాయ్స్ 2 చేస్తాడా? అని పెద్ద సందేహం నెలకొంది. తన హిట్ సినిమా కథలకు సీక్వెల్స్ చేస్తున్నాడే కానీ.. కొత్తగా శంకర్ ఆలోచించడం లేదు.. క్రియేటివిటీ పోయిందేమోనని కూడా మాటలు పడాల్సి వస్తుంది మరి. ఇలాంటి తరుణంలో శంకర్ తన సినిమాలతోనే సమాధానం చెబుతాడా? అని చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!