Shankar – Ram charan: శంకర్ సినిమా అంటే ఎంత విజువల్ వండర్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ సినిమా తీసిన హాలీవుడ్ సినిమాను మించే ఉంటుంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించే శంకర్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా చేయాలని తమిళ, తెలుగు, హిందీ స్టార్ హీరోలందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, విక్రం, అర్జున్, కమల్ హాసన్ లాంటి వారు శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకున్నారు.
ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే శంకర్ గానీ, చరణ్ గానీ చేయనటువంటి ఓ విభిన్నమైన కథతో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూనే, హైదరాబాద్‌లలో షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ షెడ్యూల్స్‌లో ఓ భారీ ఫైట్, ఓ సాంగ్‌ను కంప్లీట్ చేసినట్టు సమాచారం. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం బ్రేక్ ఇచ్చిన చరణ్
తాజాగా ఈ మూవీ షూటింగ్ మళ్ళీ ప్రారంభం కాబోతున్నట్టు తాజా సమాచారం.
Shankar – Ram charan: శంకర్ ప్రామిస్ చేశాడంటే ఓ కొత్త చరిత్ర సృష్ఠించబోతున్నట్టే..!
కొత్త షెడ్యూల్ కోసం చరణ్ చెన్నైలో ల్యాండ్ అయినట్టు లేటెస్ట్ అప్డేట్. చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ పోన్ అవడంతో కాస్త డిసప్పాయింట్ మెంట్‌తో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత శంకర్ సినిమా మీద చరణ్ మరో రేంజ్లో నమ్మకాలు పెట్టుకున్నాడు. దాంతో ఆయన చరణ్‌కు ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద హిట్ అయినా..ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసినా అంతకు మించిన హిట్ ఇస్తానని ప్రామిస్ చేశాడట. శంకర్ ప్రామిస్ చేశాడంటే ఓ కొత్త చరిత్ర సృష్ఠించబోతున్నట్టే అని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.