Categories: సినిమా

Ram Charantej: వైజాగ్ లో ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్ తేజ్..!!

Share

Ram Charantej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” విజయంతో మూడు ఇండస్ట్రీ హిట్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక పక్క హీరోగా మరో పక్క నిర్మాతగా విజయవంతంగా చరణ్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉంది. “RRR” హిట్ తో చరణ్ మార్కెట్ మరింతగా విస్తరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ పాన్ ఇండియా సినిమా చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మొన్ననే పంజాబ్ లో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడం జరిగింది. వైజాగ్ బీచ్ ఒడ్డున.. చరణ్ కాలేజీ సన్నివేశాలను.. చరణ్ పోలీసులతో గొడవపడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజులు వైజాగ్ లో షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. వైజాగ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు శ్రీకాంత్, సునీల్, అంజలి పాల్గొనడం జరిగింది అట. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ చేయాలని శంకర్, దిల్ రాజు.. ఫిక్సైనట్లు సమాచారం.

మామూలుగా శంకర్ సినిమాలంటే చాలా వరకు లేట్ అవుతాయి. పైగా అనుకున్న బడ్జెట్ కంటే సినిమా కంప్లీట్ అయ్యే లోపు మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువ అనే టాక్ ఎప్పటి నుండో ఉంది. ఈ క్రమంలో దిల్ రాజు సినిమాని ఒప్పుకున్నా టైంలో.. అనుకున్న సమయానికి అదేవిధంగా అనుకున్న బడ్జెట్ లోనే కంప్లీట్ అయ్యేలా శంకర్ దగ్గర ముందే మాట తీసుకున్నట్లు టాక్. దీంతో.. ఈ సినిమా అతి తక్కువ టైంలోనే కంప్లీట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ కెరీర్ లో ఇది 15వ సినిమా. అంతమాత్రమే కాదు చరణ్ నటించిన సినిమాల కంటే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ. దాదాపు మూడు డిఫరెంట్ పాత్రలో చరణ్ నీ శంకర్ చూపించనున్నాడని సమాచారం. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

58 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago