Categories: సినిమా

RC 15: శంకర్ – రామ్ చరణ్ సినిమాకి సంబంధించి వైరల్ అవుతున్న మూడు టైటిల్స్..??

Share

RC 15: సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ పాత్రలో కియారా అద్వానీ నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా ఉన్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. చరణ్ కెరీర్ లో ఇది 15 సినిమా. శంకర్ ఈ సినిమాలో చరణ్ నీ మూడు డిఫరెంట్ క్యారెక్టర్ లలో చూపిస్తున్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.

అందులో ఒకటి చరణ్ ముఖ్యమంత్రిగా, మరొకటి పల్లెటూరు వ్యక్తిగా ఇంకొకటి స్టూడెంట్ పాత్రలో చరణ్ నీ శంకర్ తనదైన శైలిలో చూపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. వైజాగ్, మారేడిమిల్లి అడవులు అదేరీతిలో పంజాబ్ ఇంకా హైదరాబాద్ వంటి చోట్ల షూటింగ్ జరుపుకుంటు ఉంది. గతంలో మాదిరిగా కాకుండా శంకర్ ఈ సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారట. దేశంలో కరోనా కేసులు తగ్గిపోవటంతో.. పరిస్థితులు చాలా వరకూ సాధారణ స్థితికి రావడంతో.. ఉన్న టైంలో సినిమా త్వరగా కంప్లీట్ చేయటానికి సినిమా యూనిట్ రాత్రి పగలు కష్టపడుతున్నారట.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి స్టార్టింగ్ లో పోస్టర్ లు మధ్యలో షూటింగ్ జరుపుకుంటున్న లీక్ ఫోటోలు తప్ప ఇప్పటి వరకు మరో అప్డేట్ రాలేదు. దీంతో టైటిల్ ఏంటో అన్నదానిపై కూడా రకరకాల డిస్కషన్స్ బయట జరుగుతున్నాయి. అయితే తాజాగా తెలుగు, హిందీ అదేవిధంగా తమిళ భాషలకు చెందిన ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. తెలుగులోకి వచ్చేసరికి సర్కారోడు, హిందీకి వచ్చేసరికి సర్కార్ వాలా, తమిళ్ భాష కి వస్తే సర్కార్ కరెన్.. అనే టైటిల్ పెట్టే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటన ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

1 hour ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

5 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

6 hours ago