మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొన్నటి వరకు సెరవేగంగా సాగింది. అయితే ఇటీవల తెలుగు ఫిలిం చాంబర్ తెలుగు సినిమాలకు సంబంధించి షూటింగ్ లకి బంద్ ప్రకటించడం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయాయి. ఈ తరుణంలో ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ కి సంబంధించి “భారతీయుడు” సీక్వెల్ “ఇండియన్ 2” సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు 80% కంప్లీట్ అయిన సమయంలో.. సినిమా నిర్మాతలతో శంకర్ కి వివాదం ఏర్పడింది. న్యాయస్థానం దాకా ఈ వివాదం వెళ్ళింది. కానీ ఇటీవల కమల్ నటించిన “విక్రమ్” సినిమా సూపర్ హిట్ కావడంతో.. నిర్మాతలు మరియు శంకర్ కి మధ్య కమల్ రాజీ కుదుర్చి బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో తెలుగు సినిమా షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో “RC 15” ప్రమోషన్ కార్యక్రమాలు ఆగస్టు 15 నుండి కొద్దిగా మొదలెట్టడానికి శంకర్ రెడీ అయినట్లు టాక్.
ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని.. ఒక ఫంక్షన్ గా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు. కలెక్టర్ ఇంకా గ్రామ పెద్ద. కాలేజీ కుర్రాడు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి “సర్కారోడు” అనే టైటిల్ పెట్టే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో సినిమా ఉండనున్నట్టు ఇందుకుగాను ఆగస్టు 15వ తేదీన “RC 15” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి శంకర్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్.