NewsOrbit
Entertainment News సినిమా

Game Changer: రామ్ చరణ్ “గేమ్ చేంజర్” కోసం కొత్త టెక్నాలజీ కెమెరా వాడుతున్న శంకర్…!!

Share

Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” సినిమాతో గ్లోబల్ స్టార్ట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని రేంజ్ లో చరణ్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా విస్తరించింది. చరణ్ నీ చూసి చిరంజీవి ఎంతగానో గర్వపడుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని మెగా ఫ్యాన్స్… చరణ్ ఎదుగుదలను పొగుడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్న చరణ్ “RRR” తో ప్రపంచస్థాయి హిట్ అందుకోవటం జరిగింది. ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరాకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రామ్ చరణ్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ మూవీ.

Shankar using new technology camera for Ram Charan's Game Changer

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో వేగవంతంగా జరగగా మధ్యలో బ్రేకులు పడ్డాయి. శంకర్ దర్శకత్వం లో అంతకుముందు ఆగిపోయిన “ఇండియన్ 2” షూటింగ్ మళ్లీ మొదలు కావటంతో చరణ్ సినిమాని కొన్నాళ్లు పక్కన పెట్టడం జరిగింది. ఈ క్రమంలో “RRR” ఆస్కార్ కి నామినేట్ కావడంతో చరణ్ అమెరికాలో ఫుల్ బిజీ అయ్యారు. మార్చి నెలలో ఆస్కార్ గెలవడం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ “గేమ్ చేంజర్” షూటింగ్లో మళ్లీ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో లేటెస్ట్ షెడ్యూల్ కోసం శంకర్ హైటెక్నాలజీ కెమెరాలను ప్రత్యేకంగా విదేశాల నుండి తీసుకొచ్చారంట. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ షూట్ చేయటానికి మేకోబోట్ అనే కెమెరా వాడుతున్నారట. ఇది అత్యంత హై స్పీడ్ మోషన్ కంట్రోల్ రోబోట్ కెమెరా.

Shankar using new technology camera for Ram Charan's Game Changer

అంతకుముందు ఈ కెమెరాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విక్రం, మృగం, తునివు సినిమాలు చేయడం జరిగిందంట. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఒకటి పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు పాత్రగా మరొకటి కలెక్టర్ ఇంకొకటి స్టూడెంట్ పాత్రని టాక్. ఎప్పటిలాగానే శంకర్ మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో… సందేశాత్మక చిత్రంగా ఈ సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో చేయాల్సి ఉండగా దిల్ రాజు సూచన మేరకు చరణ్ తో శంకర్ చేస్తున్నారు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.


Share

Related posts

Sunny Leone: మంచు హీరో మూవీకి సన్నీ లియోన్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే!

kavya N

కార్చిచ్చు భ‌యంతో హాలీవుడ్ స్టార్స్ ప‌రుగులు

Siva Prasad

Akkineni : అక్కినేని హీరో సెన్షేషనల్ కామెంట్స్ .. శభాస్ అంటున్న అభిమానులు..!

GRK