ఓ బాలీవుడ్ అగ్ర హీరో తనయుడు దక్షిణాదిన నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడా? అంటే అవుననే ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. ఇంతకు ఆ బాలీవుడ్ స్టార్ ఎవరో కాదు.. బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్. షారూక్ తనయుడు ఆర్యన్‌ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుండో పలు వార్తలు వినపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆర్యన్‌ఖాన్‌ను టాలీవుడ్లో నటింప చేయాలని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ భావిస్తున్నాడట. వివరాల్లోకెళ్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో `హిరణ్యకశ్యప` సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దర్శకుడు గుణశేఖర్ షారూక్‌ఖాన్‌ను కలిశాడని టాక్. అయితే ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు.
previous post
next post