Prabhas: “ఒకే ఒక్క జీవితం” సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కానుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇటీవలే అక్కినేని అమల ఇంటిలో కొడుకు అఖిల్ తో పాటు శర్వానంద్ ఇంకా అమల కలిసి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో అఖిల్ చాలా కొత్త విషయాలు తెలియజేశారు. తమ కుటుంబంలో చాలామందికి ఫేవరెట్ ఐస్ క్రీమ్ అని చెప్పుకోచ్చారు. ఇంక నాగార్జున కి కోపం వస్తే ఇంటిలో కుకింగ్ చేస్తారని అఖిల్ తెలియజేశారు.
ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ భాస్కర్ కి శర్వానంద్ .. ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో చాలా సంవత్సరాల తర్వాత “రన్ రాజా రన్” హిట్ గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో సినిమా హిట్ అని సోమవారం దాకా నమ్మలేదని శర్వానంద్ తెలిపారు. అయితే అంతకుముందు రోజే ప్రభాస్ అన్న తన ఇంటికి పిలిపించి..అరేయ్ సినిమా హిట్ అయిందిరా. నిజంగా హిట్టు కొట్టామా.. అని నేను అన్నాను. ఎందుకంటే అప్పటికే హిట్టు కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. దాంతో ప్రభాస్ అన్న ఎంజాయ్ చేయరా.. మొహం ఎందుకు అలా పెట్టుకున్నావ్ రా పార్టీ చేసుకో ఎంజాయ్ చెయ్ .. అందరూ వీడికి చెప్పండ్రా అంటూ నన్ను ఆరోజు తిట్టారు.
కానీ నేను సినిమా విజయం సాధించింది అని.. ఎప్పుడు డిసైడ్ అవుతానంటే సోమవారం కలెక్షన్ భట్టి రుజువు చేసుకుంటా. అంతకుముందు రెండు రోజులు వచ్చిన టాక్ నేను పెద్దగా పట్టించుకోను అని శర్వానంద్ అన్నారు. అలాగే “ఎక్స్ప్రెస్ రాజా” కి కూడా పార్టీ ఇవ్వటం జరిగింది అప్పుడు కూడా నేను మండే దాకా నమ్మను అన్న.. అంటూ చాలా సినిమా సక్సెస్ లు.. సోమవారం కలెక్షన్ బట్టి డిసైడ్ అయ్యా.. అంటూ శర్వానంద్ తెలియజేయడం జరిగింది.