ఒక్క ఈవెంట్ కి ఈమె ఇంత తీసుకుంటుందా..? బుల్లితెర రేంజ్ పెరిగిపోయింది సుమీ….

Share

ఈ మధ్యకాలంలో బుల్లితెర ఊపు మామూలుగా లేదు. వెండితెరపై జరిగే గ్రాండ్ ఈవెంట్లను తలదన్నేలా బుల్లితెర లో కూడా ఒక రేంజ్ లో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రతి పండుగకు బుల్లితెరపై ప్రముఖ ఛానల్లో భారీ ఖర్చు పెట్టి వారి ఛానల్ లో నటించే సీరియల్ ఆర్టిస్ట్ ల దగ్గర నుండి కమెడియన్ల వరకూ అందరినీ పెట్టి స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు. వినాయక చవితి, ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళి అని దేన్నీ వదలట్లేదు.

 

ఇందులో ఈటీవీ అందరికంటే ముందు ఉండగా…. స్టార్ మా, జీ తెలుగు మేమేం తక్కువా అన్నట్లు వ్యవహరిస్తాయి. ఇక ఇటువంటి స్పెషల్ ఈవెంట్లకు అప్పుడప్పుడు కూడా పిలుస్తుంటారు. దసరాకు రెడీ అవుతున్నా స్పెషల్ ఈవెంట్ లో ఈటీవీ లో రోజా, శేఖర్ మాస్టర్, సుధీర్, వర్షిని, హైపర్ ఆది వంటి వారు కచ్చితంగా ఉంటారు. అయితే ఈ సారి మాత్రం దానిలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

రోజా స్థానంలో సంగీత ను తీసుకున్నారు. నవదీప్ కూడా కొత్తగా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. సంగీత గతంలో బుల్లితెరపై మెరిసింది కానీ ఎక్కువ రోజులు ఉండలేదు. నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తర్వాత న్యాయనిర్ణేతగా ఒకరోజు రోజా తో పాటు వచ్చింది. ఒకే ఒక్క ఎపిసోడ్తో దానికి స్వస్తి చెప్పింది. మళ్ళీ ఈసారి స్పెషల్ ఈవెంట్ కు రావడంతో అందరి కళ్లూ ఆమెపైనే నిలిచాయి.

అలాగే రాకెట్ రాఘవ స్కిట్ లో కూడా ఎంట్ర్రీ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ స్కిట్ లో భాగంగా సంగీత స్క్రిప్ట్ ప్రకారం ఆమె పారితోషికం బయట పెట్టారో తెలియదు కానీ ఆమె పారితోషికం ఒక ఈవెంట్ కు 10 లక్షలు అని బయట పడింది. ఏదేమైనా ఇదే నిజమైతే 10,00,000 రూపాయలు మాత్రం సంగీత ఇలాంటి మాజీ ఆర్టిస్టు పెద్ద మొత్తం బయట టాక్ వినిపిస్తోంది.


Share

Related posts

రైతుల‌కు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ. 36 వేలు పొందే అవ‌కాశం!

Teja

Nani : నాని పక్కన నటించిన హీరోయిన్ స్టార్ అవుతుందనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్ ..!

GRK

వివాదంలో ‘ఆదిపురుష్’..! సైఫ్ ఆలీఖాన్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్..!!

Muraliak