చాలా రోజుల తర్వాత క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘రంగమార్తాండ’ అనే సినిమా షూటింగ్లో బిజీబిజీగా ఉన్న ఆయన.. తన ప్రాజెక్టుకి సంబంధించి తాజా తాజా అప్డేట్స్ను ట్విట్టర్లో పంచుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్.. నటిస్తున్న ఈ సినిమాలో మరొకరిని ఆయన పరిచయం చేశారు. సీనియర్ నటులు రాజశేఖర్, జీవితల ముద్దుల తనయురాలు శివాత్మిక నటిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ విషయాన్ని శివాత్మిక కూడా ధ్రువీకరిస్తూ.. ఓ జీనియస్తో కలిసి పనిచేయడం తనకెంతో ఆనందకరమంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో ప్రకాశ్, రమ్యల తనయురాలిగా ఆమె నటించనున్నట్టు సమాచారం. అందులోనూ వివాహిత పాత్రలో కనిపించనుందట. చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని.. అందుకే ఆమె దానికి ఒప్పుకుందని తెలుస్తోంది. ‘రంగమార్తాండ’ మరాఠీ రిమేక్. నానా పటేకర్ నటించిన ‘నటసామ్రాట్’కు తెలుగు రూపమే ఇది.
‘దొరసాని’తో తెరంగేట్రం చేసిన శివాత్మిక.. నటన పరంగా మంచి మార్కులు దక్కించుకున్నారు. కొత్త నటీనటులు, సాంకేతివర్గంతో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడినా.. సాంకేతికంగా మంచి మార్కులు కొట్టేసింది.