Sharukh Khan: బాలీవుడ్ బాద్ షాకు తన ఇల్లు ‘మన్నత్’ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంటికి ఇటీవల కొన్ని మరమ్మతులు చేయించారు. అందులో భాగంగా ఇంటి నామ ఫలకాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ‘మన్నత్– ల్యాండ్స్ ఎండ్’ అంటూ నిలువు అక్షరాలతో నేమ్ ప్లేట్ కు రూపునిచ్చారు. స్వతహాగా ఇంటీరియర్ డిజైనర్ అయిన షారూఖ్ భార్య గౌరీ ఖాన్.. ఆ నేమ్ ప్లేట్ కు తన నైపుణ్యాలతో రూపాన్నిచ్చింది. ఇతని కుటుంబం నివాసం ఉంటున్న ‘మన్నత్’ చూడటానికి ఎంతో మంది వస్తుంటారు. అక్కడ ఫొజులిస్తూ.. ఫొటోలు దిగుతుంటారు. అలాంటి ‘షారుక్ ఖాన్ ఇంటికి కేరాఫ్ అయిన ‘మన్నత్’ నేమ్‌ప్లేట్ కనిపించట్లేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హౌస్ నేమ్ ప్లేట్ చోరీ
మన్నత్ ముందట ఉండే నేమ్ ప్లేట్ మిస్ అయ్యిందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఎందుకంటే ఓ అభిమాని ఇంటి ముందు వీడియో తీసుకుని.. ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. నేమ్ ప్లేట్ ‘మన్నత్’ కనిపించలేదని, షారూఖ్ ఇంటికి వెళ్లిన సమయంలో తన జీవితంలో మొదటిసారిగా అక్కడ ప్లేట్ లేదని తెలిపాడు. బీటౌన్‌లో షారుక్ ఇంటికి బ్రాండ్‌గా నిలిచిన ఈ పేరు ఇప్పుడు కనిపించకుండాపోతోంది! అదేనండి.. ఆ ఇంటి ముందు ఉన్న మన్నత్ నేమ్‌ప్లేట్ మిస్ అయింది. ఇదే ప్రస్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బోర్డు చోరీకి గురైందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.
ఆ నేమ్ ప్లేట్ ఖరీదు ఎంత అంటే
ప్రస్తుతం ఆ నేమ్ ప్లేట్‌ను రిపైర్ చేస్తున్నట్లు.. మరమ్మత్తులు పూర్తయిన అనంతరం అక్కడనే దానిని ఉంచుతారని షారుఖ్‌కు సన్నిహితంగా ఉండే వారు వెల్లడిస్తున్నట్లు సమాచారం. నేమ్ ప్లేట్ తయారు చేయడానికి సుమారు రూ. 25 లక్షలు వెచ్చించారని బాలీవుడ్ వర్గాల అంచనా. షారూఖ్ కుటుంబానికి సరిపోయేలా క్లాసీ టచ్ ఇచ్చేందుకే నేమ్ ప్లేటుకు ఇంతలా ఖర్చు పెట్టారని అప్పట్లో బాలీవుడ్ లో వార్తలు కూడా వచ్చాయి.