టాలీవుడ్ అందగాడు ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మనవాళ్ళు పేరుకే తెలుగు హీరోలు గాని, ఇప్పుడున్న హీరోలందరూ ఫారిన్ రిటర్న్స్. అంటే వాళ్ళ చదువులంతా అమెరికాలోనే అయ్యాక సినిమాలు చేయాలని హైదరాబాద్ లో స్థిరపడ్డారన్నమాట. ఇక అసలు విషయంలోకి వెళితే, మహేష్ బాబు స్క్రీన్ మీద పలికే తెలుగు పలుకులకు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతారు. ఇక ఘట్టమనేని అభిమానులైతే ఇక చెప్పనవసరం లేదు. చొక్కాలు చించేసికుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
నితిన్ సినిమా పాటకు స్టెప్పులు వేసిన మహేష్ బాబు.. రియాక్ట్ అయిన నితిన్..!!
అయితే ఈ రెండూ మాత్రం రావట?
ఇకపోతే తెలుగులో చక్కగా డైలాగులు చెప్పే మన ప్రిన్స్ పెన్ను పట్టుకొని తెలుగు అక్షరాలు మాత్రం రాయలేదట. అంతేకాదు చదవనూ లేదట. ఎంతైనా ఇంగ్లీష్ మీడియం చదువులు కదా. అందుకే ఈ దౌర్భల్యం. అయితే ఇంచుమించు టాలీవుడ్ లో వున్న హీరోలందరి పరిస్థితి ఇదే. అయితే మొదట వారికి తెలుగు కూడా సరిగ్గా పలకడం చేతకాదు. అవసరం కొద్దీ నేర్చుకొని ఆ తరువాత తెలుగు పలకడంలో కాస్త నిలకడ వహిస్తారు. ఎంత తెలుగు వారైనా అత్యధిక శాతం మందికి తెలుగు మాట్లాడటం చదవడం వచ్చినా కొంత మందికి ఈ రెండూ రావని తెలుస్తోంది.
కారణం ఇదే:
అప్పట్లో మన హీరోలు కేవలం చెన్నై కే పరిమితం అయ్యారు. మహేష్ కి తెలుగు రాకపోవడానికి చదవలేకపోవడానికి ప్రధాన కారణం ఆయన స్కూలింగ్ అంతా చెన్నైలో జరగడమే. చెన్నైలో మహేష్ క్లాస్ మేట్స్ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దళపతి విజయ్, హీరో కార్తి. స్టడీ అంతా చెన్నైలో జరగడం వల్లే మహేష్ కు తెలుగు రాయడం చదవడం రాలేదని భోగట్టా. పైగా చదివింది ఇంగ్లీష్ మీడియం కావడం చేత ఆలా జరిగింది. అయితే ఈ లిస్టులో చాలామంది హీరోలే వుంటారు. వారిని గురించి మరొకసారి తెలుసుకుందాం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!