`మొగుడు
, గుంటూరు టాకీస్ చిత్రాల్లో కీలక పాత్రధారిగా లెజెండ్`లో స్పెషల్ సాంగ్ చేయడం… ఇలా పలు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ శ్రద్ధాదాస్ ఇప్పుడు కన్నడ సినిమాల్లో నటిస్తుంది. అయితే అటు నుండి తమిళంలో కూడా పాగా వేయడానికి సిద్ధమైంది. అందుకోసమని హీరోయిన్‌గానే చేయాలనేం రూల్ పెట్టుకోకుండా.. ఐటెమ్ సాంగ్‌లో అయినా చేయడానికి రెడీ అయ్యింది. అందులో భాగంగా విశాల్ `అయోగ్య
` చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌లో తళుక్కుమననుంది శ్రద్ధాదాస్.
తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించి విజయవంతమైన `టెంపర్`
సినిమాను తమిళంలో విశాల్ హీరోగా ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. వెంకట్ మోహన్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో నోరా పతేహి నేలా బెంచి.. అనే ఐటెం సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ స్థానంలో శ్రద్ధాదాస్ ఐటెం గర్ల్‌గా మెప్పించనుంది. ఇప్పటికే పాటను చిత్రీకరించేశారట. ముందుకు ఈ పాత్రకు శృతిహాసన్, సన్నీలియోన్ పేర్లు పరిశీలనలోకి వచ్చిన శ్రద్ధాదాస్తోనే సాంగ్‌ను చిత్రీకరించిందట యూనిట్. మరి ఈ ఐటెం సాంగ్ శ్రద్ధాదాస్‌కు ఏ మేర పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. విశాల్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.