NewsOrbit
Entertainment News సినిమా

Chiranjeevi: చిరంజీవితో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయబోతున్న శ్రియ..?

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” అనే సినిమా చేస్తున్నారు. తమిళంలో అజిత్ నటించిన “వేదాళం” సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండనుంది. చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్నా హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో శ్రియ చేత స్టెప్పులు వేయించబోతున్నారట. ఇందుకోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. నిర్మాతలు ఒప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో శ్రియకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Shriya is going to take steps in a special song with Chiranjeevi

పెళ్లయి రియల్ ఇచ్చినా గాని ఈ ముద్దుగుమ్మకి వరుస పెట్టే అవకాశాలు వస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో “RRR”లో కీలక పాత్ర పోషించింది. అంతకుముందు చిరంజీవి నటించిన “ఠాగూర్” సినిమాలో కూడా నటించడం జరిగింది. 2003లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్లీ 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చిరంజీవితో “భోళా శంకర్” సినిమాలో శ్రియ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు నెలలో “భోళా శంకర్” విడుదల కానుంది.

Shriya is going to take steps in a special song with Chiranjeevi

పాండమిక్ తర్వాత ఆచార్యతో అట్టర్ ఫ్లాప్ ఎదుర్కొన్న చిరంజీవి.. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. మరి “భోళా శంకర్” సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధిస్తారో లేదో చూడాలి. అయితే ఈ సినిమా తీసి దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ చూస్తే సరైన హిట్ కొట్టి చాలా సంవత్సరాలు కావటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. “భోళా శంకర్” సినిమా ప్రాజెక్ట్ ప్రకటించిన టైం లోనే కొంతమంది దర్శకుడుని మార్చాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు కావడంతో మెహర్ రమేష్ తోనే చిరంజీవి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు తో పాటు బిందాస్ సినిమా డైరెక్టర్ తో చిరంజీవి సినిమాలు చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.


Share

Related posts

Nani: మ‌న‌సు మార్చుకున్న నాని.. అభిమానులు అస‌హ‌నం

kavya N

సొంత ఊరు అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి..!!

sekhar

Sreeja Konidela: నా జీవితంలో ప్రముఖమైన వ్యక్తితో కొత్త ప్రయాణం అంటూ చిరంజీవి కూతురు శ్రీజ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

sekhar