సినిమా

Shriya Saran: బేబీ బంప్‌తో డాన్స్ ఇర‌గ‌దీసిన శ్రియ‌.. వీడియో వైర‌ల్‌!

Share

Shriya Saran: ప్ర‌ముఖ సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ శ్రియ శ‌ర‌ణ్ బేబీ బంప్‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. అలా అని ఆమె మ‌ళ్లీ ప్రెగ్నెంట్ అని అనుకోకండి సుమీ! అస‌లు ఏం జ‌రిగిందో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు చ‌క్రం తిప్పిన శ్రియ‌.. మ‌రోవైపు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాష‌ల్లోనూ న‌టించి త‌నేంటో నిరూపించుకుంది.

ఇక కెరీర్ డౌన్ కాక‌ముందే ఈ భామ‌.. రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను సైలెంట్‌గా ఎలాంటి హ‌డావుడి లేకుండా 2018లో వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత కూడా సినీ కెరీర్‌ను కొన‌సాగిస్తున్న శ్రియ.. 2020 లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఈ విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచిన శ్రియ.. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత తాను తల్లయిన విషయాన్ని అంద‌రితోనూ పంచుకుంది.

అలాగే త‌న కూతురు రాధ‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. ఇక త‌ర‌చూ రాధ‌తో క‌లిసి అడుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసే శ్రియ‌.. తాజాగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలోని ఓ త్రో బ్యాక్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె బేబీ బంప్‌తో అద్భుతంగా స్టెప్పులు వేస్తూ ఎంతో హుషారుగా క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం అభిమానుల‌ను, నెటిజ‌న్లు ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో.. నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈమె `మ్యూజిక్ స్కూల్`, `క‌బ్జా` అనే చిత్రాలు చేస్తోంది. సెట్స్ మీద ఉన్న ఈ రెండు చిత్రాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

 


Share

Related posts

మరో సినిమాను పట్టాలెక్కించిన న్యాచురల్ స్టార్

Teja

Naga chaithanya: ఇప్పుడు నాగ చైతన్యకు ఆ ఆలోచనలేదు…దృష్ఠంతా అక్కడే..!

GRK

ఫేక్ ఫోటో.. యూనిట్ వివరణ

Siva Prasad