దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. కొమరం భీం గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నసంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియ భట్, బ్రిటన్ బ్యూటి ఓలివియ మోరెస్, అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు తాజాగా న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఇంతక ముందు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కి జంటగా నటించిన శ్రియ శరణ్ ఆర్ ఆర్ ఆర్ లో నటించనుందని తాజా సమాచారం. జూన్ 15 తర్వాత రాజమౌళి హైదరాబాద్ లో వేసిన సెట్ లో షూటింగ్ మొదలవబోతుందట. ఈ సెట్ లో చరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని లేటెస్ట్ న్యూస్.
ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నట్లు శ్రియ శరణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించినట్టు తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ దేవ్ గణ్ జంటగా కనిపించబోతుందట. వాస్తవంగా శ్రియ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నట్టు ఇంతక ముందే వార్తలు వచ్చినప్పటికి ఈ విషయాన్ని ఆర్ ఆర్ ఆర్ బృందం గోప్యంగా ఉంచింది. అయితే సడన్ గా ఈ విషయాన్ని లీక్ చేసి శ్రియ అందరికీ షాకిచ్చింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!