Salaar: “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా “సలార్”. “కేజిఎఫ్”, “కేజిఎఫ్ 2” రెండు సినిమాలు భారీ విజయాలు సాధించడంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ఈ “సలార్” పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. “KGF 2” గత ఏడాది వరల్డ్ వైడ్ రిలీజ్ అయి ₹1000 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కీ దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన ప్రభాస్ తో ప్రశాంత్ సినిమా చేయటంతో “సలార్” ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించడం జరిగింది. ఈ సందర్భంగా లేటెస్ట్ గా “సలార్” కీ సంబంధించి కీలక అప్ డేట్ ఇవ్వడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. శృతిహాసన్ పాత్ర హత్యకి సంబంధించి.. సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి శృతిహాసన్ ప్రతిస్పందిస్తూ…”థాంక్యూ ప్రశాంత్ సార్.. నన్ను మీ ఆధ్యాగా మార్చినందుకు. మీ అందరితో కలిసి ఈ ప్రత్యేకమైన సినిమాలో పనిచేయడం చాలా బాగుంది” అని ఇన్స్టాల్ స్టోరీ రూపంలో పెట్టింది. ఇదిలావుండగా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ధీటుగా శ్రుతిహాసన్ కూడా యాక్షన్ సనివేశాలలో కనిపించనుందట. కాగా “సలార్” సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది.
“బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తీస్తున్న “సలార్” పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కేజీఎఫ్ మాదిరిగా రెండు భాగాలుగా విడుదల చేసి ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.