Shruti Haasan: శ్రుతి హాసన్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్లను అందుకున్న శ్రుతి హాసన్.. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ స్వింగ్లో దూసుకుపోతోంది. సినిమా కథ, అందులో తన పాత్ర నచ్చితే.. సినీయర్ హీరోలతో జత కట్టేందుకు సైతం ఈ భామ సై అంటోంది.
ఇప్పటికే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న `ఎన్బీకే 107`లో హీరోయిన్గా చేస్తున్న శ్రుతి హాసన్.. బాబీ డైరెక్టర్ చేస్తున్న `మెగా154`లో మెగాస్టార్ చిరంజీవి సరసన ఓకే చెప్పేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అలాగే మరోవైపు నేషనల్ స్టార్ ప్రభాస్తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` మూవీ చేస్తోంది.
సినిమాల విషయం పక్కన పెడితే.. శ్రుతి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోలు గత కొద్ది రోజుల నుంచి అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కబోతోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం.. శ్రుతి హాసన్ ప్రియుడు శాంతనుతో కలిసి తన సొంతూరు అస్సాంలోని గహువాటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకు కారణం లేకపోలేదు.. అస్సాంలో రొంగాలీ బిహు అతి పెద్ద ఉత్సవం. ఏటా ఏప్రిల్ రెండో వారంలో నిర్వహిస్తుంటారు. రాష్ట్ర పండుగైన రొంగాలీ బిహు వేడుకల్లో పాల్గొనేందుకే శృతి హాసన్ ప్రియుడితో కలిసి వచ్చే వారం బయలుదేరబోతోందట.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!