చిత్రపరిశ్రమలో బయోపిక్ సినిమాలకు ఏం కొదవలేదన్న విషయం తెలిసిందే. అయితే ఈ బయోపిక్ చిత్రాల్లో కొన్ని విజయాన్ని చేరితే, మరి కొన్ని అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో ఎవరికి వారు తమ జీవిత చరిత్రను తెరమీదికి ఎక్కించడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక రంగం అనేది లేకుండా దాదాపుగా అన్ని రంగాలకు చెందిన వారి జీవిత చరిత్రలు చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో టాప్ హీరోయిన్ జీవిత చరిత్ర తెరమీదికి వస్తుందనే వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ఆ అందాల తార కమల్ హాసన్ కూతురు .. స్టార్ హీరోయిన్ శృతిహాసన్.
2000 సంవత్సరంలో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాలో బాల నటిగా తెరమీద కనిపించి, 2008లో సోహం షా దర్శకత్వంలో “లక్” అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయి శృతిహాసన్ అతి తక్కువ సమయంలోనే కమల్ హాసన్ నట వారసత్వం అనే నీడ నుండి బయటపడింది. తాను ఒక స్టార్ కూతురును అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ వస్తుంది. ఇక కెరీర్ లో ఒడి దొడుకులు ఎదుర్కొన్న శృతి హాసన్ మల్టీ ట్యాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. అందుకే ఆమె జీవిత కథను సినిమా తీస్తే బాగుంటుందని భావించిన ఒక అభిమాని తాజాగా శృతి చిట్ చాట్ లో మీ బయోపిక్ కు టైటిల్ ఏమనుకుంటున్నారు అంటూ అడిగేశాడట.
ఈ ప్రశ్నకు శృతి ఊహించని విధంగా అధ్బుతమైన సమాధానం చెప్పింది. తన బయోపిక్ సినిమాకి ‘జ్వాలముఖి’ అంటూ టైటిల్ పెడతానని చెప్పేసింది. అంటే శృతి మనస్సులో తన బయోపికి నిర్మించాలనే ఆలోచన బలంగా ఉన్నట్టుగా తెలుస్తుందని .. ఫ్యాన్స్ చెప్పుకోవడం మొదలు పెట్టారు. అయితే శృతి బయోపిక్ ప్లానింగ్ బాగనే ఉంది… అలాగే ఈ బయోపిక్ కి పెట్టిన టైటిల్ కూడా బాగానే ఉంది. కానీ ఈ బయోపిక్ తీసే దర్శక, నిర్మాతలు ఎవరు అని ఇప్పుడు కొత్త ప్రశ్న తలెత్తిందట అభిమానులతో పాటుగా, చిత్ర వర్గాల్లో. ఇకపోతే శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో రవితేజతో క్రాక్ చిత్రంతో పాటుగా పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తోందన్న విషయం తెలిసిందే.