NewsOrbit
Entertainment News సినిమా

HBD Shruti Haassan: నేడు 37వ పుట్టినరోజు జరుపుకుంటున్న శృతిహాసన్..!!

HBD Shruti Haassan: విలక్షణ నటుడు కమలహాసన్ కూతురుగా వెండితెరకు పరిచయమైన శృతిహాసన్ అతి తక్కువ కాలంలోనే తిరుగులేని హీరోయిన్ గా పేరు సంపాదించుకోవడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది బ్యాక్ గ్రౌండ్ చెప్పుకొని ఎంట్రీ ఇస్తారు. కానీ కొంతమంది క్లిక్ అవుతారు. వెనకాల ఉండే వాళ్ళ సపోర్ట్ ఎంట్రీ వరకు పనిచేసిన మిగతా అంతా టాలెంట్ బట్టి ఉంటుంది. ఈ క్రమంలోనే కమల్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ అనతి కాలంలోనే తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటనపరంగా ఇంక డాన్స్ పరంగా కూడా అన్ని రకాలుగా శృతి ఎంతగానో పేరు సంపాదించుకుంది. కెరియర్ స్టార్టింగ్ లో స్టోరీలు ఎంచుకునే విషయంలో కొద్దిగా తప్పటడుగులు వేసి వరుస ప్లాపులు చవి చూసింది. ఆ టైంలో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది.

Shruti Haasan is celebrating his 37th birthday today
Shruti Haasan birthday today

ఆ తర్వాత అనతి కాలంలోనే వరుసగా బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సాధించింది. ఫస్ట్ 2012లో హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “గబ్బర్ సింగ్”తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత “శ్రీమంతుడు” సినిమాతో మరో విజయం అందుకున్న శృతిహాసన్ ఇంకా వెనక తిరిగి చూసుకోకుండా.. వరుస పెట్టి హిట్ లు ఇచ్చింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించిన శృతిహాసన్ 2018 వ సంవత్సరంలో పవన్ తో చేసిన “కాటమరాయుడు” తర్వాత తెలుగు సినిమాల ఆపేసింది. ఆ తర్వాత మిగతా భాషలలో చేసిన వరుస పరాజయాలు రావడంతో మళ్లీ 2021లో “క్రాక్” సినిమాతో టాలీవుడ్ లో రియంట్రి ఇచ్చి విజయం సాధించింది. ఆ తర్వాత పవన్ నటించిన “వకీల్ సాబ్” లో అవకాశం అందుకోవటం జరిగింది. ఈ క్రమంలో తన తండ్రి తరం హీరోలు అయినా బాలకృష్ణ మరియు చిరంజీవి లతో ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు చేసి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.

Shruti Haasan is celebrating his 37th birthday today
Shruti Haasan birthday celebration’s

తన పాత్రకు స్క్రిప్టులో ప్రాధాన్యత ఉంది అంటే అటువైపు ఏ హీరో ఉన్న ఒప్పేసుకుంటూ.. చాలా తెలివిగా కెరియర్ నీ నిర్మించుకుంటూ ఉంది. సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలు విజయం సాధించటంతో… శృతిహాసన్ సంక్రాంతి సక్సెస్ హీరోయిన్ గా ప్రస్తుతం కీర్తించబడుతుంది. ఇక ఇదే సమయంలో “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “సలార్”లో కూడా నటిస్తోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ పలు కీలకమైన యాక్షన్స్ సన్నివేశాలలో కూడా కనిపించనున్నట్లు సమాచారం. హీరోయిన్ గా మాత్రమే కాకుండా సింగర్ మరియు మ్యూజిక్ కంపోజర్ గా కూడా మంచి పేరు సంపాదించింది. ఇదిలా ఉంటే నేడు శృతిహాసన్ 37వ బర్తడే నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఆమె అభిమానులు భారీ ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా భారీ ఎత్తున ఆమె పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ స్టోరీ రీల్స్ మొత్తం ఆమె బాయ్ ఫ్రెండ్ ఫోటోలతో నిండిపోయాయి. మరోపక్క పలువురు సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కాగా త్వరలోనే శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ శాంత హజారికానీ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

Related posts

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri