Shruti Haasan: ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లోకనాయకుడు, సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ గడప తొక్కినప్పటికీ.. శ్రుతి హాసన్ తనదైన టాలెంట్‌తో సౌత్‌లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. గతంలో శ్రుతి లండన్ కుర్రాడు మైఖేల్ కర్సెల్‌తో ప్రేమాయణం నడిపించింది.
కొన్నాళ్లు రిలేషన్లో ఉన్నాక మనస్పర్థలు తలెత్తడంతో ఈ జంట విడిపోయింది. బ్రేకప్ తర్వాత శ్రుతి హాసన్ కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైంది. డిప్రెషన్లోకి వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలాగే ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో మళ్లీ ప్రేమలో పడింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్న శ్రుతి, శాంతను.. త్వరలోనే పీళ్లి పీటలెక్కబోతున్నారని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో శ్రుతి పెళ్లిపై చేసిన కామెంట్స్ కొత్త చర్చలకు దారి తీసింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ప్రేమంటే హ్యాపీనే.. కానీ, పెళ్లి అంటేనే ఆందోళనగా ఉందంటూ పేర్కొంది.
దీంతో శ్రుతి హాసన్ కి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా..? సహజీవనానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా..? శంతనుతో రిలేషన్ కొన్నాళ్లేనా?అందుకే అలా మాట్లాడిందా..? అన్న చర్చలు ఊపందుకున్నాయి. కాగా, శృతి హాసన్ పేరెంట్స్ కమల్-సారికల గురించి తెలిసిందే. పెళ్లికి ముందే పిల్లల్ని కన్న ఈ జంట.. ఆపై వివాహం చేసుకున్నారు. కానీ, పెళ్లి అనంతరం వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. అయితే వారి ప్రభావం ఏమైనా శ్రుతిపై పడిందా అంటే.. కాదనే ఆమె చెబుతోంది.