న్యూస్ సినిమా

Shruti Hassan: శృతికి గ్యాప్ ఇవ్వని ఆ ముగ్గురు..అయినా సై అంటోంది..!

Share

Shruti Hassan: మూడేళ్ళ లాంగ్ గ్యాప్ వచ్చే సరికి సౌత్ సినిమా ఇండస్ట్రీలలో శృతి హాసన్ కెరీర్ క్లోజ్ అనుకున్నారు. కానీ, క్రాక్ సినిమాతో ఒక్కసారిగా శృతి బౌన్స్ బ్యాక్ అయింది. మూడేళ్ళ గ్యాప్ వచ్చినా కూడా ఈ సినిమాతో అందుకున్న భారీ హిట్‌తో అసలు గ్యాప్ వచ్చినట్టే ఎవరూ అనుకోవడం లేదు. అంతేకాదు, అనూహ్యంగా శృతికి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశం రావడం షాకింగ్ విషయమే. అందులో ఒకటి పాన్ ఇండియన్ సినిమా కావడం మరో విశేషం. ఇప్పటికే, ఈ మూడు సినిమాల షూటింగ్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

shruti-hassan busy with back to back shoots
shruti-hassan busy with back to back shoots

ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో శృతిది చాలా ఇంపార్టెంట్ రోల్. ఈ సినిమా గనక హిట్ అయితే, శృతిహాసన్‌కు పాన్ ఇండియా వైడ్‌గా వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే, కేజీఎఫ్ 2 రిలీజ్ కారణంగా సలార్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ మళ్ళీ మే నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. ప్రభాస్ కూడా ఈ లాంగ్ షెడ్యూల్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చారట. గ్యాప్ తీసుకోకుండా సలార్ కంప్లీట్ చేయనున్నారు. దీనిలో శృతి కూడా పాల్గొనాల్సి ఉంది.

Shruti Hassan: మళ్ళీ ఇలాంటి అవకాశాలు దక్కడం కష్టమని..

ఇక క్రాక్ సినిమాతో మళ్ళీ ట్రాక్ ఎక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ శృతి హాసన్. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మెగా 154లో కూడా హీరోయిన్ శృతి హాసన్. ఈ రెండు సినిమాలు గ్యాప్ లేకుండా చిత్రీకరణ సాగుతున్నాయి. ఇలా ఈ చిత్రాలను రూపొందిస్తున్న ముగ్గురు దర్శకులు గ్యాప్ లేకుండా శృతికి సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేస్తున్నారు. కాస్త కూడా గ్యాప్ దొరకకపోయినా కూడా మళ్ళీ ఇలాంటి అవకాశాలు దక్కడం కష్టమని ..వచ్చినప్పుడే సినిమాలను చేయాలని శృతి టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా ఓకే అంటూ డేట్స్ ఇస్తోందట.


Share

Related posts

Prabhas, NTR: ప్రభాస్, ఎన్టీఆర్ చేతులు కలిపితే మాములుగా ఉండదు.. చూడండి మీరే..

Ram

హైదరాబాద్ లో రజినీకాంత్.. ‘అన్నాతే’ షూటింగ్ పిక్స్ వైరల్..

Muraliak

A – ఆదిపురుష్ : వాళ్ళూ వీళ్లూ ఇవ్వడం కాదు కృష్ణం రాజు ఇచ్చాడు.. ప్రభాస్ ఫాన్స్ కి పూనకాలు వచ్చే అప్ డేట్

Varun G