shruti Haasan: శృతి హాసన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ స్టార్ కమల్ హాసన్ పుత్రికగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తన నటన ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఫ్లాప్ సినిమాలను చూసిన శృతిహాసన్ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. శృతిహాసన్ కేవలం నటిగా మాత్రమే కాకుండా మంచి సింగర్ అనే విషయం అందరికీ తెలిసిందే.తన కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు శృతిహాసన్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు.
కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శృతి హసన్ తాజాగా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో శృతి హాసన్ మరి ఫామ్ లోకి వచ్చిందని భావించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ సినిమాలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వం ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారు.
రచయితగా మారిన శృతిహాసన్:
ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న శృతి హసన్ ఈ మధ్యనే రైటర్ గా మారింది. ఇందులో భాగంగానే శృతిహాసన్ రాసి పెట్టుకున్న లైన్స్ ను బౌండెడ్ స్క్రిప్ట్గా మార్చబోతున్నట్టు చెబుతోంది. కుదిరితే ఈ కథను దర్శకత్వం వహించి కొత్త సినిమాకి డైరెక్ట్ చేయాలనే ఆలోచనలో శృతిహాసన్ ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా, సింగర్ గా మంచి విజయం, గుర్తింపు సంపాదించుకునే శృతిహాసన్ దర్శకత్వం వహించి విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. శృతిహాసన్ సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ, ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.