సినిమా

Siddharth: పాన్ ఇండియా అనేది ఒక భ్రమ అని తేల్చేసిన ‘బొమ్మరిల్లు’ సిద్దార్ధ్!

Share

Siddharth: ప్రస్తుతం భారతదేశ సినిమా సిర్కిల్ లో పాన్ ఇండియా అనే పదం బాగా ఫేమస్ అవుతోన్న సంగతి తెలిసిందే. సౌత్ సినిమాలు దేశమంతటా వసూళ్ల సునామి కొనసాగించడంతో సౌత్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా కీర్తింపడుతుంది. ఆ కీర్తి మనకు రావడానికి బాహుబలి, KGF, RRR, పుష్ప సినిమాలు దోహద పడ్డాయి. ఇప్పుడు సౌత్ ఆడియన్స్ ఎంతో గర్వంగా మా సినిమా అని ఫీలవుతున్నారు. ఇక పాన్ ఇండియా అనే పదాన్ని మొదటిసారి పరిచయం చేసింది రాజమౌళి అన్న సంగతి తెలిసినదే. బహుశా బాహుబలి అనే సినిమా లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమో. ఈ క్రమంలో ఎంతోమంది కళాకారులు పాన్ ఇండియా స్థాయిలో సౌత్ సినిమాలను కొనియాడుతున్నారు.

Siddharth Says that Pan India is an illusion!
Siddharth Says that Pan India is an illusion!

Siddharth: అదేంటి సిద్ధూ అలా అనేశాడు!

ఈ క్రమంలో కొందరు ప్రముఖులు సౌత్ క్రియేటివిటీని ఆకాశానికి ఎత్తేస్తే, మరికొంత మంది ఎలా పాతాళానికి తొక్కేయాలా? అన్న మాదిరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నటుడు సిద్దార్ధ్ పాన్ ఇండియా సినిమాపై తన ఒపినీయన్ ని కూడా చెప్పుకొచ్చారు. ‘పాన్-ఇండియన్ అనేది చాలా అగౌరవకరమైన పదం. పాన్-ఇండియన్ అనేది నాన్సెన్స్! సినిమాలన్నీ భారతీయ చలన చిత్రాలే. 15 సంవత్సరాల క్రితం పాన్-ఇండియన్ సినిమా లేదని చెప్పాలా? నా బాస్ మణిరత్నం ఎప్పుడో అలాంటి సినిమాలు తీశారు. రోజా అనే సినిమా భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూసారు.

Siddharth Says that Pan India is an illusion!
Siddharth Says that Pan India is an illusion!

KGF తీసింది వారి స్నేహితులట?

ఇలా మాట్లాడుతూ మన సిద్ధూ ‘కేజీఎఫ్’ సినిమాని వారి స్నేహితులే తీసినట్టు కటింగ్ ఇస్తూ, పొగిడే ప్రయత్నం చేసాడు. మధ్యలో ఎక్కడా రాజమౌళి ప్రస్థానం తీసుకు రాలేదు. దాంతో మన తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రం సిద్ధుపైన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మన తెలుగు సినిమా వలన పాపులర్ సంపాదించిన సిద్ధూ ఇలా మాట్లాడటం పట్ల వారు ఒకింత అసహనానికి లోనైనట్టు భోగట్టా.


Share

Related posts

Krithi Shetty: ఆ విష‌యంలో బాగా బాధ‌ప‌డుతున్న కృతి శెట్టి..అస‌లేమైందంటే?

kavya N

ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ మహాసముద్రం కోసం భలే అమ్మాయిని సెలెక్ట్ చేశాడుగా ..?

GRK

Kriti Shetty: మెగా కాంపౌండ్‌లో కృతిశెట్టి..రష్మిక మందన్న, పూజా హెగ్డేలను మించిపోతుందా..?

GRK