NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: బాలయ్య వ్యక్తిత్వం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సిద్దు జొన్నలగడ్డ..!!

Share

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం చాలా విభిన్నమైనదని అందరికీ తెలుసు. “అన్ స్టాపబుల్” టాకీ షో స్ట్రీమింగ్ అవ్వకముందు వరకు బాలయ్య బాగా కోపేష్టి అని అందరూ అనుకునే వాళ్ళు. కానీ ఈ షో స్టార్ట్ అయ్యాక బాలయ్యలో మరో కోణం చూసి చాలామంది విమర్శకులు సైతం అభిమానులుగా మారిపోయారు. అంతగా బాలకృష్ణని ఆ షో చాలామంది దగ్గరకు చేర్చడం జరిగింది. ఈ టాకీ షో స్టార్ట్ అవ్వక ముందు బాలకృష్ణ అంటే కోపం ఎక్కువ… తురుసుగా ఉంటాడు అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. కానీ ఈ షో వాటన్నిటిని పక్కన పెడుతూ బాలయ్యలో మరో కోణం కూడా ఉందని రుజువు చేసింది.

Siddu Jonnalagadda made interesting comments on Balayya's personality

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ.. బాలకృష్ణ వ్యక్తిత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. నటసింహం బాలకృష్ణ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు అన్నదాని గురించి ఇటీవల ఈ డీజే టిల్లు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బయట ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు బాలకృష్ణకు అభిమానులే అని చెప్పుకొచ్చాడు. ఆయన ఒక్కసారి ఒక మనిషిని తన సొంత వ్యక్తి అని భావిస్తే.. అతడి కోసం ఎంత దూరమైనా వెళ్తారని చెప్పుకొచ్చాడు. అందమైన, దయ కలిగిన చిన్నపిల్లాడి మనస్తత్వం బాలయ్యది అని పేర్కొన్నాడు. దీంతో సిద్దు జొన్నలగడ్డ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Siddu Jonnalagadda made interesting comments on Balayya's personality

“అన్ స్టాపబుల్” టాకీ షోలో.. సెకండ్ సీజన్ విశ్వక్ సేన్ తో కలిసి రావటం జరిగింది. ఆ ఎపిసోడ్ చాలా హైలెట్ మంచి కామెడీ పండించింది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. గత ఏడాది ‘డీజే టిల్లు’ మూవీతో తన యాక్టింగ్‌తో పాటు తన పెన్ను పవరేంటో చూపించాడు. ఈ సినిమా సెన్సేసన్ క్రియేట్ చేసింది. కలెక్షన్లతో హోరెత్తించింది. ప్రస్తుతం బాలకృష్ణ… అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దసరా పండుగకు విడుదల కానుంది.


Share

Related posts

Prabhas: ప్రభాస్‌కు అది ఎంత వరకు కలిసొస్తుందో..మొదటిసారి ట్రై చేస్తున్నాడు..!

GRK

భాస్క‌ర‌భ‌ట్ల‌కు మాతృ వియోగం

Siva Prasad

Pradeep Machiraju: ప్రదీప్ తన పెళ్లి గురించి చెప్పిన సంగతులు!!

Naina