Singham Again vs Pushpa 2: వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2”, అజయ్ దేవగన్ “సింగం ఎగైన్” రెండు సినిమాలు ఒకేసారి ఢీ కొనబోతున్నాయి. దీంతో ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా మోస్ట్ అవైటెడ్ “పుష్ప 2”.. వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో రెండు భారీ చిత్రాలు ఒకే సీజన్ లో ఢీకొట్టనున్నాయి. రెండిటిలో ఏది పై చేయి సాధిస్తుంది అన్నది పెద్ద డిస్కషన్ గా మారింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2021లో విడుదలయ్యి సూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించింది. దీంతో ఇప్పుడు పుష్ప రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో తగ్గేదేలే డైలాగ్ బన్నీ మేనరిజమ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. దీంతో పాన్ ఇండియా నేపథ్యంలో రాబోతున్న “పుష్ప 2” కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు సినిమాని మరింతగా మెరుగులు దిద్దుతూ మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత యాక్షన్ కాంబో ప్యాక్ ఎంటర్టైనర్ గా చిత్రీకరించబోతున్నారట. మరోపక్క అజయ్ దేవగన్ సింగం… హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రోహిత్ శెట్టి తీస్తున్నారట.
అయితే రెండు సినిమాలు వచ్చే ఏడాది ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం నాడు విడుదల కాబోతున్నానే పద్యంలో మార్కెట్ వర్గాలలో క్రేజ్ పరిశీలిస్తే.. “పుష్ప 2” దే పైచేయిగా కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీ భాషల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది నార్త్ బెల్ట్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా “పుష్ప 2” చాలాసార్లు ఫలితాలలో బయటపడింది. ప్రస్తుతం పుష్ప 2 క్రేజ్ బట్టి చూస్తే హిందీలో సింగం సినిమా పెద్దగా పట్టింపు లేదని చెప్పవచ్చు. కానీ అజయ్ దేవగన్ సీనియర్ హీరో కావడంతో… హిందీలో మార్కెట్ ఉండటంతో “సింగం ఎగైన్” ఏ మేరకు పుష్పకి పోటీ ఇస్తుందో చూడాలి.