Chinmayi: సింగర్,డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి చిన్మయి సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. మహిళ సమస్యలను ఎప్పుడూ ప్రపంచానికి తెలిసేలా చేస్తుంటుంది. మహిళలు ఎదుర్కొనే బాధలను, సమాజంలో అమ్మాయిలపై జరిగే అకృత్యాలను ఎప్పటికప్పుడూ ఎత్తి చూపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెను చాలా దారుణంగా కించపరుస్తూ ఉంటారు. మాటలతోనే కాకుండా పిచ్చి పిచ్చి ఫోటోలతోనూ వేధిస్తుంటారు. అయినా వాటిని చిన్మయి ధైర్యంగా ఎదుర్కొంది. అంతేకాక ఆమెను పరుషపదజాలంతో కామెంట్లు చేస్తున్న వారిని సైతం చిన్మయి తన స్టైల్లో ఎదుర్కొంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇన్‌స్టాగ్రాంపై చిన్మయి అసహనం..
అయితే తాజాగా చిన్మయి మాత్రం కాస్త అసహనాన్ని ప్రదర్శించింది. ఇన్స్టాగ్రాం చేసిన పనికి చిన్మయి తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్టు కనిపిస్తోంది. తనకు ఇన్‌స్టాగ్రాంలో డైరెక్ట్ మెసెజ్‌లు చేసిన వారికి రిప్లై ఇస్తుంటుంది. కానీ గత కొన్ని రోజులుగా చిన్మయి ఇలా రిప్లైలు ఇవ్వలేకపోతోందంట. ఇన్ స్టాగ్రాం తన అకౌంట్ ను బ్లాక్ చేసిందని చిన్మయి వాపోయింది. కమ్యూనిటి గైడ్ లైన్స్‌కు వ్యతిరేకంగా తాను పోరాడతాను అని చెప్పేసింది. తనకు అసభ్యకరమైన ఫోటోలను పంపించే వ్యక్తుల ఖాతాలు మాత్రం యాక్టివ్గానే ఉంటున్నాయి.. కానీ నా ఖాతా మాత్రం రిప్లైలు ఇవ్వకుండా బ్లాక్ చేసేశారు అంటూ ఇన్ స్టాగ్రాం మీద మండిపడింది చిన్మయి.
పెద్ద ఎత్తున నెటిజన్ల సపోర్ట్..
తప్పు చేేసే వాళ్లను వదిలిపెట్టి.. చిన్మయి అకౌంట్ ను బ్లాక్ చేస్తారా? అంటూ ఇన్స్టాగ్రాం మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమెను ఇంకా ఎన్ని చోట్ల బ్యాన్ చేస్తారు అంటూ నిలదీస్తున్నారు. మొత్తానికి చిన్మయికి మాత్రం నెట్టింట్లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే చాలామంది చిన్మయికి తమ బాధలను చెప్పుకుంటారు. నీ వల్లే ఈ రోజుకైనా మేం వీటిని ధైర్యంగా బయటపెడుతున్నాం.. వీటి గురించి మాట్లాడగలుగుతున్నాం.. మీరే మాకు స్పూర్తి అంటూ చిన్మయి మీద ప్రశంసలు కురిపిస్తుంటారు.