Singer KK Dies: బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా పేరొందిన కృష్ణకుమార్ కున్నాత్ (KK) లైవ్ ప్రోగ్రాం ఇస్తూనే కుప్పకూలి మరణించారు. 53 సంవత్సరాల వయసు కలిగిన కృష్ణకుమార్ కున్నాత్ (KK) గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రేమికులను ఎంతగానో తన పాటలతో అలరించాడు. ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించడం జరిగింది. ఈ క్రమంలో కోల్ కతా లో జరిగిన ఓ లైవ్ ఈవెంట్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఈవెంట్ నిర్వాహకులు కుప్పకూలిన..కృష్ణకుమార్ కున్నాత్ (KK) నీ దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దురదృష్టవశాత్తు అప్పటికే కృష్ణకుమార్ కున్నాత్ (KK) మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చనిపోడానికి కొద్ది క్షణాలకు ముందు లైవ్ ఈవెంట్ ప్రోగ్రాంకి సంబంధించిన ఫోటోలను… తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన ఫాలోవర్స్ కి తెలిసేలా పోస్ట్ చేయడం జరిగింది. అయితే కొద్ది క్షణాలలోపే కృష్ణకుమార్ కున్నాత్ (KK) హఠాత్తు మరణం ఆయన అభిమానులకి సడన్ షాక్ ఇచ్చినట్లయింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని సింగర్ గా కేకే కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఒక హిందీలో మాత్రమే కాదు తమిళం అదేవిధంగా తెలుగు, కన్నడ, బెంగాలీ ఇంకా అనేక భాషలలో పాటలు పాడాడు. ఆయనకు భార్య తో పాటు పిల్లలు కూడా ఉన్నారు. లైవ్ ఈవెంట్ కి కొద్ది క్షణాల ముందు…ఈవెంట్ ఇస్తున్న సమయంలో బాగానే ఉన్నా.. ప్రదర్శన ఇస్తూ కృష్ణకుమార్ కున్నాత్ (KK).. వేదికపైనే కుప్పకూలి మరణించటంతో చూస్తున్న వీక్షకులు కూడా.. తాజా దుర్ఘటననీ జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి కూడా కృష్ణకుమార్ కున్నాత్ (KK) మరణవార్త షాక్ కు గురి చేసింది. కృష్ణకుమార్ కున్నాత్ (KK) మరణానికి గల కారణం గుండెపోటు అని వైద్యులు ధ్రువీకరించారు. 53 సంవత్సరాల వయసులోనే మంచి గాయకుడు మరణించడంతో సినీ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.