RRR: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అందరికీ సుపరిచితుడే. తెలుగు చలనచిత్ర రంగంలో అనేక హిట్ సాంగ్స్ పాడటం జరిగింది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ కూడా. ఈ క్రమంలో మనోడు ఆస్కార్ వేదికపై పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. పూర్తి విషయంలోకి వెళ్తే “RRR” లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ క్రమంలో “RRR” కీ ఆస్కార్ రావాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. అయితే నాటు నాటు సాంగ్ పాడటానికి రాహుల్ సిప్లిగంజ్… రెడీ అయ్యాడు.
ఈనెల 12వ తారీకు ఆస్కార్ వేడుకలలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఈ పాట లైవ్ ప్రదర్శన ఇస్తారని ఆస్కార్ అకాడమీ ప్రకటించటం పై రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. “ఇది నా జీవితంలో మర్చిపోలేని సందర్భం. ఆ క్షణాల కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను”అనీ సోషల్ మీడియాలో రాహుల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పటికే ఈ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. దీంతో కచ్చితంగా నాటు నాటు సాంగ్ కి అవార్డు రావడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అమెరికాలో రామ్ చరణ్ తేజ్ గుడ్ మార్నింగ్ అమెరికా అనే షోలో పాల్గొనడం తెలిసిందే.
ఆ షోలో ఓ యాంకర్ “RRR”..నాటు నాటు సాంగ్ గెలిచేసింది అన్న తరహాలో లీక్ ఇచ్చే విధంగా కామెంట్లు చేయడం జరిగింది. పక్కనున్న యాంకర్లు సైతం ఆ కామెంట్లకు షాక్ అయ్యారు. బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం “RRR” ఆస్కార్ ఆల్రెడీ గెలిచేసినట్లు ఇంక ప్రకటించటమే… తరువాయి భాగం అన్నట్లు సమాచారం. త్వరలోనే “RRR” సినిమా యూనిట్ ఆస్కార్ వేడుకలకు బయలుదేరానుంది. ఈ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ప్రస్తుతం చరణ్ మరియు ఎన్టీఆర్ తాము చేయబోయే సినిమాల షూటింగ్స్ వాయిదా వేసుకున్నారు.