Singer Sunitha : ఈ మధ్యకాలంలో సింగర్ సునీత పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందుకు గల కారణం ఈమె రెండో పెళ్లి చేసుకోవడమే అని చెప్పవచ్చు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న చాలా సంవత్సరాలకు సింగర్ సునీత డిజిటల్ మీడియా సంస్థ అధినేత అయిన రామ్ వీరపనేని జనవరిలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అప్పటినుంచి సునీత పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతోంది. అయితే ప్రస్తుతం సింగర్ సునీతకు ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ కు ఆమె ఒప్పుకుంటారా లేదా అనే విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇంతకీ అద్భుతమైన అవకాశం ఏమిటంటే… సింగర్ సునీత కు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే అవకాశం వచ్చినట్లు సమాచారం.
బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. తాజాగా డిసెంబర్ నెలలో సీజన్ 4 పూర్తిచేసుకున్న ఈ రియాల్టీ షో తొందరలోనే సీజన్ ఫైవ్ ప్రారంభించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ యూట్యూబ్ స్టార్ట్ అయిన షణ్ముఖ్ జస్వంత్‌కు భారీ ఆఫర్ ఇచ్చి సీజన్ 5 కోసం లాక్ చేసారని తెలుస్తోంది. అదేవిధంగా మరొక యూట్యూబ్ స్టార్ దుర్గారావుని కూడా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కోసం కన్ఫామ్ చేసినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం ఈ సీజన్లో పాల్గొనే అవకాశాన్ని సింగర్ సునీత కు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఆఫర్ కు కొత్త పెళ్లికూతురు ఒప్పుకుంటుందా…
బిగ్ బాస్ సీజన్ 1లో సింగర్ కల్పన, సీజన్ 2లో గీతా మాధురి, సీజన్ 3 రాహుల్ ఈ విధంగా ప్రతి సీజన్ లో బిగ్ బాస్ నిర్వాహకులు ఒక సింగర్ ని తీసుకోవడం సాధారణంగా జరుగుతున్న విషయమే. అయితే సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం బిగ్ బాస్ నిర్వాహకులు సునీతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా పెళ్లయిన ఈ పెళ్లి కూతురు ఈ బిగ్ బాస్ ఆఫర్ కి ఒప్పుకుంటుందా? లేదా? అదే విషయం గురించి క్లారిటీ తెలియడం లేదు.ఇప్పటికే కంటెస్టెంట్ ల ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు జూన్ నెలలో సీజన్ ఫైవ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.