singer sunitha: ప్రముఖ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గాత్రం, మైమరపించే అందంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సునీత.. 2020లో వ్యాపారవేత్త అయిన మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.
ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్‌ను, కెరీర్‌ను చక్కగా రాణిస్తున్న సునీత.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో తన ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మామిడి చెట్టు పక్కన ఒక మామిడి కాయను పట్టుకుని ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అలాగే ఈ పిక్కు `బ్లెస్డ్` అంటూ కామెంట్ పెట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ పోస్ట్‌తో సునీత మళ్లీ తల్లి కాబోతోందంటూ అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రధాన మీడియాలో జోరుగా ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారాన్ని గమనించిన సునీత.. ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే ఆ వార్తలపై తనదైన శైలిలో ఫుల్‌గా క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే..
`ఓ మై గాడ్.. పీపుల్ ఆర్ క్రేజీ.. మా మామిడి తోటలో ఫస్ట్ క్రాప్ వచ్చిందని ఫొటో తీసి పోస్ట్ చేస్తే.. నేను ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఏదేదో ఊహించుకొని ఇలాంటి రూమర్స్ ను ప్రచారం చేయడం ఆపండి. మీకు దండం రా నాయనా` అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. మరి ఇప్పటికైనా సునీతపై వస్తున్న ప్రెగ్నెంట్ వార్తలకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.
https://www.instagram.com/p/CcsWIQkFMLU/?utm_source=ig_web_copy_link