Singer Sunitha: టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వ్యాఖ్యాత సునీత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. గుంటూరులో జన్మించిన ఈ తెలుగమ్మాయి.. పదిహేనేళ్ల వయసులోనే గాయనిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కష్టాలనే పునాదులుగా మలుచుకుని తనకంటూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. మధురమైన గానంతోనే కాదు.. అందమైన రూపంతోనూ తెలుగు ప్రేక్షకులకు ఈమె బాగా దగ్గరైంది.
ఇక చిన్న వయసులోనే భర్త కిరణ్ నుంచి విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత.. ఎట్టకేలకు గత ఏడాది ఆరంభంలో మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.
ప్రస్తుతం భర్త రామ్.. పిల్లలు ఆకాష్, శ్రేయలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది. ఇకపోతే సునీత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో తన ఫాలోవర్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేసే సునీత.. తాజాగా జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్ ను ధరించి లూజ్ హెయిర్‌తో అదిరిపోయే విధంగా ఫొటో షూట్ చేసి అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇంకేముంది సునీత అందాలు చూసి ఆమె అభిమానులే కాదు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
కొందరైతే సో స్వీట్, రెండు కళ్ళు చాలడం లేదు, మీ అందం ముందు హీరోయిన్ కూడా పనికిరాదు అంటూ రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి సునీత తాజా ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.