సినిమా

Sunitha: రోడ్డుపై చెరుకు రసం తీస్తున్న సింగర్ సునీత.. వైర‌ల్‌గా మారిన వీడియో!

Share

Sunitha: ప్ర‌ముక సింగర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ సునీత అంటే తెలియ‌ని వారుండ‌రు. గుంటూరులో జ‌న్మించిన ఈమె.. టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత సింగ‌ర్‌గా వివిధ భాష‌ల్లో వంద‌లాది పాట‌లు పాడిన ఈమె.. ప‌లు సినిమాల్లో హీరోయిన్ల‌కు గాత్ర‌దానం కూడా చేసింది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే సునీత‌.. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది.

తాజాగా కూడా ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో సునీత మండే ఎండ‌ల్లో రోడ్డుపై చెరుకు ర‌సం తీస్తూ క‌నిపించింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. సునీత కారులో వెళుతూ రోడ్డు ప్రక్కన ఉన్న చెరకు రసం బండి దగ్గర ఆగారు. ఆ పానీయం తాగడంతో పాటు పనిలో పనిగా చెరకు రసం తీసే ఆ గానుగ‌ను తిప్పి త‌న‌ సరదా తీర్చుకున్నారు.

Singer Sunitha

ఇందుకు సంబంధించి వీడియోనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది సునీత‌. దీంతో ఈ వీడియోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా, సునీత వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ఈమె 2021 జనవరి 9 మ్యాంగో మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.

పెళ్లి త‌ర్వాత అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సునీత‌.. మొన్నీ మ‌ధ్య మామిడి తోటలో మామిడి పండ్ల‌ను ప‌ట్టుకుని ఫొటో దిగి ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. దీంతో సునీత మ‌ళ్లీ త‌ల్లి కాబోతోందంటూ జోరుగా వార్త‌లు రాగా.. ఆమె వెంట‌నే వాటిని ఖండించి పుకార్ల‌కు ధీటుగా స‌మాధానం ఇచ్చింది.

https://www.instagram.com/reel/CdF4WQYhDiL/?utm_source=ig_web_copy_link


Share

Related posts

తెలుగు సినిమా సంచలనం.. ‘శివ’కు 31 ఏళ్లు..

Muraliak

ప్రభాస్ ప్లాన్ అదిరిపోయింది…. ఆ టాలెంటెడ్ డైరెక్టర్ ఇక నుంచి యూవి లోనే సెటిలవుతున్నాడు ..?

GRK

`రూల‌ర్‌`ముందుగానే ?

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar