Singer Sunitha: ప్రముఖ సింగర్ సునీత అంటే తెలియని వారుండరు. హీరోయిన్‌కి ఏ మాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. 15 సంవత్సరాల వయసులోనే సినీ గడప తొక్కిన సునీత.. ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో వేలాది పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. ఈమె సింగర్ మాత్రమే కాదు యాంకర్‌గానూ, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సత్తా చాటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

ఇకపోతే సునీత గత ఏడాది సరిగ్గా ఇదే రోజు(జనవరి 9)న మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనినితో మూడు ముళ్లు వేయించుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నేడు సునీత-రామ్‌ల తొలి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా `వెడ్డింగ్ మెమోరీస్`అంటూ ఓ స్పెషల్ వీడియోని యూట్యూబ్ ద్వారా సునీత అందరితోనూ షేర్ చేసుకుంది. సునీత, రామ్‌ల వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ఇది. ఇందులో సునీత, రామ్‌ల గురించి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాట్లాడుతున్న క్లిప్స్ కూడా ఉన్నాయి.

అలాగే భర్త రామ్ గురించి సునీత మాట్లాడుతూ.. `ఆయన తనుకు ఎనిమిదేళ్లుగా తెలుసు, చాలా నీజాయితీపరుడు, ఏదైనా ముఖంపైనే చెప్పే వ్యక్తిత్వం తనది. అతను మంచి కాఫీ లాంటి అబ్బాయ్` అని తెగ మురిసిపోయింది. మొత్తానికి ఆకట్టుకుంటున్న ఈ వీడియో సునీతను ఇష్టపడే ప్రతి ఒక్కరు చూడాల్సిందే. కాగా, సునీతకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైనది. వీరికి అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయలు జన్మించారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా కిరణ్‌కి సునీత విడాకులు ఇచ్చేసి పిల్లలనే చూసుకుంటూ కాలాన్ని గడిపింది. అయితే తమ తల్లికి ఓ తోడు కావాలని నిర్ణయించుకున్న సునీత ఇద్దరు పిల్లలూ ఆమెను రామ్‌కి ఇచ్చి వివాహం జరిపించారు.