Singer Sunitha: భ‌ర్త‌తో 5 నిమిషాల క్రితం ఇన్‌స్టాలో ఫొటో పెట్టిన సునీత‌..ఇద్ద‌రు భ‌లే ఉన్నారు!

Share

Singer Sunitha: టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌నదైన‌ గాత్రంతో ల‌క్ష‌లాది ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకున్న సునీత‌.. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్న రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 10న శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా వీరి వివాహం వైభ‌వంగా జ‌రిగింది.

singer sunitha shares a new pic with her husband
singer sunitha shares a new pic with her husband

పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌, పిల్ల‌ల‌తో లైఫ్‌ను మంచిగా ఎంజాయ్ చేస్తున్న సునీత‌.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం త‌న‌కు సంబంధించిన ఏదో ఒక విష‌యాన్ని ఫాలోవ‌ర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అయితే సునీత‌-రామ్‌ల వివాహమై ఏడాది కావొస్తోంది. వీరి ఏడాది ప్ర‌యాణంలో కొన్ని అందమైన క్షణాలను ఓ వీడియో రూపంలో జ‌న‌వ‌రి 9న అంద‌రితోనూ షేర్ చేసుకోబోతున్నారు.

singer sunitha shares a new pic with her husband
singer sunitha shares a new pic with her husband

ఈ విష‌యాన్నే సునీత తెలుపుతూ.. ఐదు నిమిషాల క్రితం భ‌ర్త రామ్‌తో దిగిన‌ ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోలో రామ్‌, సునీత‌లు భ‌లే చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుండ‌డంతో.. అది కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, సునీత త‌న 19 ఏళ్ల వ‌య‌సులో కిరణ్ కుమార్ గోపరాజును పెళ్లి చేసుకుంది. వీరికి ఆకాశ్, శ్రేయా అనే ఇద్దరు సంతానం కలిగారు. అయితే ఆ త‌ర్వాత కిర‌ణ్‌, సునీత మ‌ధ్య మనస్పర్థలు త‌లెత్త‌డంతో.. క‌లిసి ఉండ‌లేక విడిపోయారు. అప్పటి నుంచి పిల్ల‌ల‌ను చూసుకుంటూ ఒంట‌రిగానే జీవితాన్ని గ‌డిపిన సునీత‌.. గ‌త ఏడాది రెండో వివాహం చేసుకుంది. త‌ల్లి పెళ్లిని ఆకాశ్, శ్రేయాలు ద‌గ్గ‌ర నుండి మ‌రీ ఘ‌నంగా జ‌రిగిపించారు.

singer sunitha shares a new pic with her husband
singer sunitha shares a new pic with her husband

https://www.instagram.com/p/CYeDJUQl_DB/?utm_source=ig_web_copy_link


Share

Related posts

బాలయ్య టార్గెట్ మామూలుగా లేదు.. ఇక నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవాల్సిందే..!

GRK

మ‌రింత ఆల‌స్యం

Siva Prasad

`ట‌క్ జ‌గ‌దీష్‌`గా నాని

Siva Prasad