singer sunitha: గత కొద్దిరోజుల నుంచి సింగర్ సునీత పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దానికి గల కారణం ఆమె రెండో పెళ్లి చేసుకోవడమనే చెప్పవచ్చు. గులాబీ సినిమాలో “ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో”అనే పాట ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సునీత తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇండస్ట్రీలోకి వచ్చిన రెండు సంవత్సరాలకు కిరణ్ కుమార్ అనే వ్యక్తి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని కారణాల వల్ల తన భర్తకు దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతలను చూసుకునేది. అయితే ఒంటరిగా గడుపుతున్న సునీత తాజాగా డిజిటల్ మీడియా ఓనర్ రామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
సునీత తన రెండవ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సునీత తన పెళ్లికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు.రామ్ వీరపనేని ను శంషాబాద్ పురాతన ఆలయంలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.పెళ్లి అనంతరం సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం సునీత వెడ్డింగ్ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సునీత వెడ్డింగ్ టీజర్ సమంత, కాజల్ పెళ్లి వేడుకలకు ఏ మాత్రం తగ్గకుండా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సునీత విడుదలచేసిన టీజర్ లో తన పెళ్లి కార్యక్రమాలు మొదలైనప్పటి నుండి పెళ్లి అయ్యేంత వరకు ఉన్న ఈ వీడియో అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియోలో సునీత ఎంతో ఆనందంగా కనిపిస్తుంది.అంతే కాకుండా తన పిల్లలతో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలను కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు. సునీతను పెళ్లి కూతురు చేసినప్పటినుంచి పెళ్లి అయ్యేంత వరకు తన స్నేహితురాలు ప్రముఖ యాంకర్ సుమ కనకాల పక్కన ఉన్నారు. సునీతను పెళ్లి కూతురు చేస్తున్నప్పుడు తన కళ్ళల్లో ఆనందం చెప్పలేనిది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన టీజర్ విడుదల చేయగా త్వరలోనే పెళ్లి వీడియో కూడా షేర్ చేయనున్నారు.