Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’..సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ. గీత గీవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారిన పరశురామ్ పెట్లా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. కీర్తిసురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక నేరల ఆధారంగా యూనివర్సల్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నాడని ఇప్పటికే వదిలిన పోస్టర్స్‌తో పాటు టీజర్, కళావతి సాంగ్‌తో అందరికీ అర్థమైంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్ అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తైన ఈ మూవీని మే 12న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుతూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తూన్నారు.
Sarkaru Vaari Paata: తండ్రితో కలిసి స్టెప్పులేసి అదరగొట్టింది.
ఈ నేపథ్యంలో రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమా నుంచి వచ్చిన కళావతి పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యింది తెలిసిందే. ఇప్పటికీ ఈ సాంగ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ పెన్ని విడుదల చేశరు. ఈ సాంగ్‌లో సూపర్ స్టార్ గారాల కూతురు సితారపాప తండ్రితో కలిసి స్టెప్పులేసి అదరగొట్టింది. జస్ట్ ప్రోమో సాంగ్‌లోనే అందరినీ సర్ప్రైజ్ చేసేలా స్టెప్పులేసిందంటే ఇక ఫుల్ సాంగ్‌లో ఈ క్యూట్ గాళ్ ఎంతగా ఆకట్టుకుంటుందో అని మహేశ్ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. మహేశ్ బాబు, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి.