Categories: సినిమా

Allu Arjun: బ‌న్నీ ఎంత క‌ట్నం పుచ్చుకున్నాడో చెప్పేసిన స్నేహా రెడ్డి తండ్రి!

Share

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ‌న్నీ.. 2011 మార్చి 6వ తేదీన స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అప్ప‌ట్లో అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. వివాహ‌మై ఇటీవ‌లె 11వసంతాలను పూర్తి చేసుకున్న బ‌న్నీ-స్నేహాలు.. టాలీవుడ్‌లో అందమైన, అనోన్యమైన జంట‌గా గుర్తింపు పొందారు.

అల్లు అర్జున్, స్నేహారెడ్డిది ప్రేమవివాహం. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని అమ్మాయి స్నేహా. కులాలకు అతీతంగా బ‌న్నీ-స్నేహాలు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె జ‌న్మించారు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే బన్నీ.. ఫ్యామిలీతో గడపడానికి సైతం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా స్నేహా రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి.. పెళ్లి స‌మ‌యంలో బ‌న్నీ ఎంత కట్నం పుచ్చుకున్నాడు అన్న విష‌యంపై ఆస‌క్తికర కామెంట్స్ చేశారు. తాజాగా చంద్ర‌శేఖ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ గురించి మాట్లాడుతూ.. అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తాను.

అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో బ‌న్నీకి భారీగా అభిమానులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడలో బన్నీ నిరంత‌రం కష్టపడుతూనే ఉంటాడు` అని చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే పెళ్లి సమయంలో బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా.. `బన్నీ అసలు కట్నం తీసుకోలేదు. వాళ్లకే చాలా ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు. కట్నాలకు వాళ్లు వ్యతిరేకం` అని పేర్కొన్నారు. దాంతో ఆయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

1 hour ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

5 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

6 hours ago