Ponniyan Selvan 2: సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో క్లోజ్ గా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. అంతేకాదు లండన్ లో ఓ రెస్టారెంట్ లో చెఫ్ తో నాగచైతన్య ఫోటో దిగగా వెనకాల శోభిత ధూళిపాళ కూర్చుని ఉండటంతో.. ఆమెతో చైతన్య క్లోజ్ గా వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లు అయ్యింది. అయితే ఈ విషయంలో మొన్నటి వరకు… శోభిత ధూళిపాళ… నాగచైతన్య ఎవరూ కూడా స్పందించలేదు. అయితే ఆ ఫోటోస్… ఫేక్ అని అందులో వాస్తవం లేదని కూడా ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ గా హైదరాబాద్ లో “పొన్నియన్ సెల్వన్ 2” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ కార్యక్రమానికి శోభిత ధూళిపాళ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. తనకి ఆరోగ్యం సహకరించకపోయినా గానీ.. ఈ ఈవెంట్ కి రావడం జరిగిందని పేర్కొంది. ఈ సినిమాలో పనిచేసిన ఓ టెక్నీషియన్ అరుణ్ విరామన్ గురించి మాట్లాడాలని యాంకర్ శోభిత ధూళిపాళనీ ప్రశ్నించడం జరిగింది. దీనికి సమాధానం ఇస్తూ దొరికి దొరక నట్టు ఉంటాడు.. ఆయన ఒక మిస్టరీ చై మాదిరిగా అంటూ… క్లారిటీ ఇవ్వటం జరిగింది.
దీంతో నాగచైతన్యతో.. శోభిత క్లోజ్ గా ఉంటున్నట్లు వస్తున్నా వార్తలలో వాస్తవం ఉన్నట్లు అర్థమవుతుంది. ఏప్రిల్ 28వ తారీకు ఈ సినిమా విడుదల కారుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, త్రిష, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ… ఇతర నటీనటులు కీలకపాత్రలు పోషించడం జరిగింది. “పొన్నియన్ సెల్వన్ 1” కి సీక్వెల్ గా వస్తున్న ఈ రెండో భాగం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదలవుతుంది. చోళ సామ్రాజ్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్… కలసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మొదటి భాగం మాది విజయం సాధించటంతో “పొన్నియన్ సెల్వన్ 2” పై ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉన్నాయి.