బాహుబలి 1 లో ఇంటర్వెల్ బ్లాక్ లో రానా బంగారు విగ్రహం ఉంటే., వెనుక బాహుబలి బంగారు విగ్రహం మరింత పెద్దదిగా ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పరిస్థితి ఇదే పోలి ఉంది. అత్యంత తీవ్ర ఉత్కంఠ మధ్య సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ గెలిచి ట్రోఫీ, 25 లక్షలు గెలుచుకున్నాడు. ఇక్కడ అభిజిత్.. రానా అయితే.. సొహెయిల్ బాహుబలి అయ్యాడు. కారణం.. ఉత్కంఠభరిత క్షణాల మధ్య అత్యంత వేగంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. గేమ్ లో అభిజీత్ పోరాటం, ఆటిట్యూడ్.. కు సాటి లేదు. కానీ.. తన భవిష్యత్ ను నిర్ణయించే కీలక సమయంలో సొహెయిల్ అప్పటికప్పుడు చాతుర్యం అందరినీ ఫిదా చేసేసింది.
మొదటినుంచీ గేమ్ లో సొహెయిల్ ‘కథ వేరే ఉంటది’ అంటూ స్పెషల్ గా నిలచాడు. కాయిన్ కు ఒకవైపు అభిజిత్ కామ్ అండ్ కూల్ అయితే.. రెండో వైపు సొహెయిల్ మాస్ అండ్ రఫ్. ఇవే వీరిద్దరినీ ఇప్పుడు ప్రత్యేకంగా నిలిపాయి. మల్టీస్టారర్ సినిమాల్లో ఒక హీరో సాఫ్ట్ అయితే.. మరో హీరో మాస్ అయినట్టు. ముఖ్యంగా సొహెయిల్ బిగ్ బాస్ లోకి వచ్చాక స్నేహానికి ఇచ్చిన విలువ ప్రేక్షకులకు కొత్తగా అనిపించేలా చేసింది. అఖిల్ ను అన్నయ్య, మెహబూబ్ ను తమ్ముడు అన్నాడు.. అంటూనే ఉన్నాడు. ఫైనల్ కు వెళ్లేందుకు అఖిల్ కు దారి ఇస్తే.. మెహబూబ్ కు 5 లక్షలు సాయం చేశాడు. హౌస్ లో పెంచుకున్న స్నేహాన్ని ఫైనల్ లో కూడా కాపాడుకున్నారు.
నిజానికి వచ్చిన 25 లక్షల్లో 10 లక్షలు చారిటీకి కేటాయిండం గొప్ప విషయం. ఫైనల్ లో నిలిచినా వచ్చేది 25 లక్షలు.. మధ్యలో వెళ్తే వచ్చేది 25 లక్షలు. తీసుకుంటే టెన్షన్ తప్పించుకోవచ్చనే సొహెయిల్ ఆలోచన అద్భుతం. అదే ఆలోచన, స్నేహానికి ఇచ్చిన విలువ కోట్లాదిమంది ప్రేక్షకుల్నే కాదు.. ఇద్దరు సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ ను మెప్పించింది. దీంతో వారి డబ్బు వారి వద్దే ఉంది.. వీరి పేరు మీద సూపర్ స్టార్స్ ద్వారా చారిటీ కూడా జరిగిపోయింది. మొత్తానికి ఈ సీజన్ 2019 క్రికెట్ వరల్డ్ కప్ ను తలపించింది. కప్ ఇంగ్లాండ్ కు.. పేరు న్యూజిలాండ్ కు. ఇక్కడా అదే జరిగింది. కాబట్టి బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ గేమ్ చేంజర్ నిస్సందేహంగా.. ‘సయ్యద్ సొహెయిల్’
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!