సినిమా

venkatesh: వెంకటేష్ అలా ప్ర‌వ‌ర్తిస్తార‌ని అనుకోలేదు.. బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్‌!

Share

venkatesh: విక్ట‌రీ వెంక‌టేష్ త్వ‌ర‌లోనే `ఎఫ్ 3` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మ‌రో హీరోగా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించ‌గా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

2019లో రిలీజ్ అయిన సూప‌ర్ హిట్ మూవీ `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా `ఎఫ్ 3`ని రూపొందించారు. ఇందులో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టించ‌గా.. వ‌రుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ చేసింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌ను షురూ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సోనాల్ చౌహాన్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె సినిమాకు సంబంధించి ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది. అలాగే వెంక‌టేష్ పై షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది.

అస‌లేం జ‌రిగిందంటే.. `వెంకటేశ్‌, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో పని చేయడం ఎలా ఫీల్ అయ్యారు..?` అని ప్ర‌శ్నించ‌గా అందుకు సోనాల్ చౌహాన్‌..`వెంకటేశ్‌గారు గొప్ప నటుడే కాదు.. గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మనిషి కూడా. సెట్స్‌లో అందరితో కలిసిపోయి మాట్లాడతారు. సహనటులు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే స‌హాయం చేస్తారు. అస‌లు ఆయ‌న అలా ఫ్రెండ్లీగా ప్ర‌వ‌ర్తిస్తార‌ని అస్స‌లు అనుకోలేదు. వెంకటేశ్‌ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక వరుణ్ తేజ్ చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఆయ‌న‌తో వర్క్ చేయడం కూడా ఆనందాన్ని ఇచ్చింది.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.


Share

Related posts

Pawan kalyan : పవన్ కళ్యాణ్ తో నాగ చైతన్య అంటే కష్టమే అంటున్నారు ..?

GRK

Pushpa movie: బన్నీ కోసం ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు..?

sekhar

`పిహిల్వాన్` ట్రైల‌ర్ విడుద‌ల‌… సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar