NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. గత ఏడాది సమ్మర్లోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. యుశసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. అలాగే ఇందులో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. అలియా భట్, రష్మిక మందన్నా, పూజా హెగ్డే, దిశా పటానీ, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించినా.. ఎవరినీ కన్ఫార్మ్ చేయలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచీ ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే కీలక పాత్రను పోషించబోతోందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి బింద్రేకు.. ఎన్టీఆర్ సినిమాపై ప్రశ్న ఎదురైంది.
అందుకు ఆమె తనను ఎవరూ సంప్రదించలేదని, నెట్టింట జరుగుతున్న ప్రచారం ఫేక్ అంటూ తేల్చేసింది. ఏంటి ? నేనా ? ఎన్టీఆర్ సినిమాలోనూ..? అంటూ ఆమె ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేసింది. కాగా, సోనాలి బింద్రే గత కొంత కాలం నుంచి వెండితెరకు దూరంగా ఉంటోంది. 2018లో కాన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే.. అమెరికాలో చికిత్స తీసుకుని ఆ వ్యాధి బారి నుంచి బయటపడింది.