Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “జబర్దస్త్” అనే కామెడీ షో ద్వారా యాంకర్ గా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి పరిచయమైన అనసూయ అనతి కాలంలోనే ఊహించని పాపులారిటీ సంపాదించింది. అయితే చాలాకాలం జబర్దస్త్ వేదికపై అలరించిన అనసూయ…. ఆ గుర్తింపుతో టెలివిజన్ రంగంలో పలు షోలలో అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవటం జరిగింది. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలలో అనసూయ నటనపరంగా కూడా తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరైన సుకుమార్ దర్శకత్వంలో… “రంగస్థలం”, “పుష్ప” లలో కీలకపాత్రలు చేయడం జరిగింది.
రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో… అనసూయ నటన ఎంతోమందిని ఆకట్టుకుంది. ఆ రకంగా బుల్లితెరపై అదే విధంగా వెండితెరపై రాణిస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక షోరూమ్స్ ఓపెనింగ్స్ ప్రారంభిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో హీరోయిన్ ల కంటే అనసూయ చాలామంది షోరూమ్స్ ఓపెనింగ్ చేస్తోంది. ఇక ఇదే సమయంలో తీరిక దొరికితే కుటుంబంతో అనసూయ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటది. ఆ రకంగా బీచ్ లు… రెస్టారెంట్లు తిరుగుతూ ఉంటది. ఈ క్రమంలో ఇటీవల కుటుంబ సమేతంగా పిల్లలతో సహా గోవా బీచ్ లో బికినీతో సందడి చేసింది. దీంతో నెటిజన్ లు..”ఎదిగే పిల్లల ముందు తలకాయ ఇటువంటి బట్టలు వేసుకొని పద్ధతేనా అసలు ఇది ఇండియానా అమెరికానా అంటూ దారుణంగా ట్రోల్ చేయటం జరిగింది.
అయినా వాటిని పట్టించుకోకుండా అనసూయ ఆ రకంగానే ఇటీవల ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో బికినీతో కుటుంబ సమేతంగా ఫోజులిస్తూ ఎంజాయ్ చేయటం జరిగింది. ఈ క్రమంలో అనసూయ పెద్ద కుమారుడు…”ఎందుకు అమ్మ ఎలా పొట్టి బట్టలు వేసుకుంటావ్..? కాస్త పెద్దవి వేసుకోవచ్చు కదా..? అని మొహం మీద చెప్పాడట. నా బట్టలు నా ఇష్టం నాకు చాలా స్వేచ్ఛగా ఉంటేనే నచ్చుతుంది అని పిల్లలకు గట్టిగా సమాధానం ఇచ్చినట్లు అనసూయ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.