Sonu Sood: దేశంలో కి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి పరిస్థితులు అంతా తారుమారు అవుతున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా క్షణక్షణానికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని వాతావరణం ఈ మహమ్మారి ప్రస్తుతం క్రియేట్ చేయడం జరిగింది. పేదవాని మొదలుకొని డబ్బు ఉన్న వారి వరకు ఎవరిని విడిచిపెట్టకుండా అందరూ సమానమే అన్న తరహాలో.. ఈ కరోనా తన పని తాను చేసుకుంటూ పోతుంది. సమాజంలో సెలబ్రిటీలు సైతం ఈ మహమ్మారిని ఎదుర్కోలేక కొంత మంది ప్రాణాలు విడుస్తూ ఉంటే మరికొంత మంది ప్రాణాలతో పోరాడుతున్నారు.
ఇదిలా ఉంటే గత లాక్డౌన్ నుండి అనేక మందికి సేవలందిస్తూ సరైన టైంలో మానవత్వం చూపిస్తున్న నటుడు సోనుసూద్ తాజాగా ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా కి సైతం హెల్ప్ చేశారు. మేటర్ లోకి వెళ్తే తనకి తెలిసిన పెద్దావిడ 65 సంవత్సరాల వయసు కలిగిన ఆమె ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ చెప్పటంతో కేవలం పది నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్ లను పంపించి ఆమెను కాపాడి సురేష్ రైనా కి బిగ్ హెల్ప్ చేశాడు సోనుసూద్.
ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో క్రికెట్ ప్రేమికులు సోను చేసిన సహాయం పట్ల చేతులెత్తి దండం పెడుతున్నారు. నీలాంటోడు దేశానికి ప్రధాని అయి ఉంటే.. భారతదేశంలో ఈ చావుల కేకలు ఆర్తనాదాలు వినబడేది కాదు అంటూ మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.