లాక్ డౌన్ లాంటి కష్ట సమయంలో అనేకమందిని ఆదుకోవడమే కాక ఇప్పటికి కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. వెండితెరపై టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు విలన్ పాత్రలు చేస్తూ మరోపక్క హిందీలో కూడా రాణిస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న సోనుసూద్, కరోనా వచ్చిన తర్వాత తనలో ఉన్న మానవత్వాన్ని బయటపెట్టి అసలుసిసలైన మనిషి ఎలా ఉంటాడో ప్రపంచానికి చాటి చెప్పాడు.
ఇదిలా ఉంటే లాక్డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ రవితేజ కొట్టిన సంగతి తెలిసిందే. క్రాక్ సినిమాతో సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా విజయంతో సినిమా యూనిట్ మొత్తం ఫుల్ హ్యాపీగా ఉంది. కాగా ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో సోనూసూద్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి హిందీ రీమేక్ హక్కులు నిర్మాత ఠాగూర్ తో సోను సూద్ మాట్లాడినట్లు అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిలిం వర్గాల లో టాక్ నడుస్తుంది. స్వయంగా ఈ సినిమాను తానే నిర్మిస్తానని ఆలోచనలో సోనూసూద్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం.