ఎస్పీ బాలసుబ్రమణ్యం సమాధి మీద ఏం రాశారో తెలుసా.. ఆయనే అడిగి రాయించుకున్నారు!

కొన్ని దశాబ్దాల నుంచి 16 భాషలలో, 40 వేలకు పైగా పాటలు పాడి అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న బాలు గారు, తను చనిపోయిన తర్వాత తన సమాధి మీద ఏం రాయాలో కూడా ముందే చెప్పారు. పుట్టిన వారికి ఏదో ఒక రోజు కచ్చితంగా మరణం సంభవిస్తుంది, ఎవరైనా ఏదో ఒకరోజు చనిపోవాలి. నాకు చావు మీద ఎలాంటి భయము లేదని బాలసుబ్రమణ్యం గారు ఎప్పుడు చెప్తుంటారు.

 

1999లో బాలసుబ్రమణ్యం గారు నిర్వహిస్తున్న పాటల పోటీ కి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలమురళి కృష్ణ గారు అంటే బాలు గారికి ఎంతో గురుభక్తి తాను నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కావడంతో బాలు గారు ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల సుబ్రహ్మణ్యం గారిని ఉద్దేశించి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మాట్లాడారు.”బాలు బాగా కష్టపడితే తనలాగా పాడగలడు అని కానీ నేను ఎంత కష్టపడినా బాలు లాగా పాడలేనని” చెప్పారు.

ఆ మాట విన్న బాలసుబ్రమణ్యం గారికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తన ఆనందానికి అవధులు లేకుండా వెళ్ళాయి. తన గురువు అంతటి వారు తనని అలా అనడంతో తన జన్మ ధన్యమైందని భావించారు. ఈ మాటలకు వెంటనే బాలు గారు స్పందిస్తూ మీ అంతటి వారు నా గురించి ఇలాంటి మాటలు చెప్పడం నిజంగా నా అదృష్టం. నా జీవితంలో ఇంత కంటే గొప్ప ప్రశంశలు లేవు. ”నేను చనిపోతే నా సమాధి మీద మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అంతటి వారు బాలసుబ్రమణ్యం గురించి ఇలా అన్నారు” అని రాయాలని కోరారు. అయితే ప్రస్తుతం ఈ మాటలను గుర్తు చేసుకుంటూ బాలు గారు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.