Rajamouli: భారతీయ చలనచిత్ర రంగం యొక్క కీర్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ప్రధాన కారణం ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అనే టాపిక్ వచ్చేసరికి బాలీవుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. జక్కన్న చెక్కిన బాహుబలి 2, “RRR” సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాయో అదే రీతిలో ప్రపంచ సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి.
మరి ముఖ్యంగా “RRR” నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తరువాత హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఆస్కార్ నామినేషన్ లకి కూడా ఎంపిక అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సినిమాలకు హాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పలు అంతర్జాతీయ సినీ వేడుకలకు రాజమౌళికి ప్రత్యేకమైన ఆహ్వానాలు అందుతున్నాయి. ఇదే సమయంలో అక్కడ రాజమౌళి సినిమాలు ప్రదర్శిస్తున్న సమయంలో.. విదేశీయులు థియేటర్ లలో ఊహించని రీతిలో రియాక్షన్స్ ఇస్తున్నారు. “RRR” చూశాక చాలా మంది హాలీవుడ్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ నటీనటులు రాజమౌళి పనితనంపై పొగడ్తలతో ముంచెత్తారు.
పరిస్థితి ఇలా ఉంటే అమెరికాలో అంతర్జాతీయ మీడియా పత్రిక.. రాజమౌళి గురించి ప్రత్యేక కథనం ప్రచురించింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల గవర్నర్ అవార్డుల కోసం రాజమౌళి అమెరికా వెళ్లడం జరిగింది. ఆ సమయంలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు జక్కన్నకి సినిమా ఆఫర్లు గట్టిగా ఇచ్చినట్లు..లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక ‘ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ముంగిట భారీ అవకాశాలు’ అంటూ రాజమౌళిపై కథనం ప్రచురించింది. ఒకప్పుడు రాజమౌళి అమెరికా సినిమాలు చూస్తూ పెరిగాడు… ఇప్పుడు రాజమౌళి సినిమాలు చూస్తూ అమెరికా ప్రేక్షకులు ఊగిపోతున్నారని ఆ పత్రిక కథనం యొక్క సారాంశం. హాలీవుడ్ రాజమౌళి తో పనిచేయడానికి రెడీగా ఉందని.. లాస్ ఏంజెల్స్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో.. దాదాపు హాఫ్ పేజీ రాజమౌళి గురించి రాయటం జరిగింది. దీంతో ఈ కథనంపై.. రాజమౌళి అభిమానులు సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి విదేశాలలో పర్యటిస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!